నిన్నటి నుంచి జగన్ పాదయత్ర చేస్తున్న క్యాంప్ లో ఒకటే టెన్షన్.. దానికి కారణం, తన వెనుక ఉన్న 11 సిబిఐ, 5 ఈడీ కేసులు... అన్నిట్లో ఒకరు A1, మరొకరు A 2.. కేవలం కండీషన్ బెయిల్ పైనే బయట తిరుగుతున్నారు. ఇవన్నీ తెలిసినవే కదా టెన్షన్ ఎందుకు అంటారా... ఇలాంటి ఆర్దిక ఉగ్రవాదుల పై, ఈ రోజు సుప్రీం కోర్ట్ కీలక తీర్పు ఇవ్వనుంది అనే సమాచారంతో, జగన్ ముఠా అంతా అలెర్ట్ అయ్యింది. తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే, ఇక జగన్ కు రాజకీయ సమాధే. అందుకే టెన్షన్.. కాని, సుప్రీం కోర్ట్ మాత్రం, భిన్నమైన తీర్పు ఇవ్వటంతో, జగన్, విజయసాయి రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు.
ఇక విషయానికి వస్తే, వచ్చే నెల 2న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, కొద్దిసేపటి క్రితం కీలక కేసులో తీర్పును వెలువరించారు. నేరారోపణలు, ఆర్థిక నేరాభియోగాలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంలో తాము ఎటువంటి ఆదేశాలనూ ఇవ్వలేమని, అభ్యర్థుల అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. నేతల అవినీతి జాతీయ ఆర్థిక ఉగ్రవాదమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, ఈ విషయంలో పార్లమెంటులో కఠిన చట్టాలను తేవాల్సివుందని పేర్కొంది. రాజ్యాంగ సవరణ, కొత్త చట్టాలు తెస్తేనే, నేర చరితులను రాజకీయాలకు, ఎన్నికలకు దూరంగా పెట్టవచ్చని తెలిపింది. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ తమపై ఉన్న పెండింగ్ కేసులను తప్పనిసరిగా వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది.
క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు.. అభియోగాల నమోదు దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులను చేయాలా అన్న ప్రశ్నను లేవదీస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 28న తన తీర్పును వాయిదా వేసింది. ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలాకే సదరు చట్టసభ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు భాజపా నేత అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్లు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.