ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఆలోచనలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా, వ్యక్తులైనా కలిసి వస్తే వారితో పనిచేయడానికి సిద్ధమన్నారు. అలాకాని పక్షంలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని తన అలోచనలను కార్యాచరణలో పెట్టడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అగ్రనేతలైనా మిమ్మల్ని సంప్రదించారా? అని అడిగిన ప్రశ్నకు లేదని సమాధానమిచ్చారు. మీరు ఎవరినైనా సంప్రదించారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ ఇప్పుడే తన ఆలోచనలకు ఒక రూపకల్పన చేశానని ఇక వాటిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళతానని తెలియజేశారు. ధనం, కులాలకు అతీతంగా తన రాజకీయ ప్రయాణం ఉంటుందన్నారు.

jd 07102018 2

అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తన ఆలోచనా విధానమన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ధనం, కులం కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. ఎన్నికలంటేనే ధన వ్యయంతో కూడుకున్న ఒక ప్రక్రియగా మారిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తన ప్రచారం కోసం నిర్ధిష్టమైన మొత్తాన్ని వ్యయం చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మొత్తానికన్నా తక్కువ వ్యయం చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది తన వైఖరి అన్నారు. ఎన్నికల సందర్భంగా 50 శాతం మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే మంచి పరిపాలకులను ఎంచుకోవచ్చని అది ప్రజా సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అమలు కావాలన్నది తన ఆలోచన అన్నారు.

jd 07102018 3

రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాలకు సంబంధించిన సమస్యలను అక్కడి ప్రజలే గుర్తించి ఎన్నికలకు ముందు తమ వద్దకు వచ్చే ప్రతి అభ్యర్థి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అంతేకాకుండా ప్రతి అభ్యర్థి వద్ద వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై సంతకం తీసుకోవాలన్నారు. ఎన్నికల తరువాత ఎవరు గెలుస్తారో సమస్యల పరిష్కారం కోసం వారిని ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుందన్నారు. ఒకవేళ సదరు ఎన్నికైన అభ్యర్థి ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే వంద రూపాయల స్టాంప్‌పై సంతకం చేసిన ప్రతిపాదనలకు సంబంధించి న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయవచ్చని అన్నారు. ఆ ప్రక్రియకు తాను అన్నివిధాలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read