కొన్ని రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి తన ఎంపీల చేత, పార్లిమెంట్ లో పోరాటం చెయ్యనివ్వకుండా, వారి చేత రాజీనామాలు చేపించి, అమిత్ షా డైరెక్షన్ లో చేసిన తంతు గుర్తుందా ? మేము ఇప్పుడు రాజీనామా చేస్తున్నాం, ఎన్నికలకు వెళ్తున్నాం అంటూ బిల్డ్ అప్ ఇచ్చారు. కాని ఎన్ని నెలలు అయినా దీని పై ఎక్కడా కదలిక లేదు. ఇదంతా అమిత్ షా డైరెక్షన్ లో నడిచిన స్క్రిప్ట్ అని తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపించింది. దానికి తగ్గట్టుగానే, అవిశ్వాసం సమయంలో బీజేపీని నిందించే ధైర్యం లేక, రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారు. మరో పక్క తెలుగుదేశం ఎంపీలు, పార్లిమెంట్ లో మోడీని చాకిరేవు పెట్టారు.

jagan 06102018 2

అయితే ఇప్పుడు మరోసారి ఈ రాజీనామా అంశం తెర పైకి వచ్చింది. సరిగ్గా జూన్ 2 తో మోడీ పాలన మొదలైన రోజు. అయితే వీరి రాజీనామాలు కనుక జూన్ 2 న ఆమోదం చేసి ఉంటే, ఎన్నికలు వచ్చేవి. కాని వీరి రాజీనామాను చాలా తెలివిగా జూన్ 3న ఆమోదించారు. అంటే ఒక్క రోజు గ్యాప్ తో, సాంకేతిక కారణం చూపించటం కోసం. ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా అదే చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే ఎప్పుడో రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామా ప్రస్తావన వచ్చింది. దీంతో, ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.

jagan 06102018 3

‘2019 జూన్‌ 4వ తేదీతో లోక్‌సభ పదవీకాలం గడువు ముగుస్తుంది. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన నియోజకవర్గాలకు కనీసం ఏడాది పాటు అయినా ప్రజాప్రతినిధులు పదవిలో ఉండాలి. ఏడాదిలోపు పదవీ కాలం ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేదని ఎన్నికల చట్టంలో స్పష్టంగా ఉంది. ఈ ఏడాది జూన్‌ 3వ తేదీన వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదించారు. అప్పటి నుంచి లెక్క చూస్తే వచ్చే ఏడాది జూన్‌ 4వ తేదీకి లోక్‌సభ‌ పదవీకాలం గడువు ముగుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు’ అని రావత్‌ స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read