తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేసారు. ఈసీ ప్రకటనతో వైసీపీ డ్రామాలు బయటపడ్డాయన్నారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ, ఏపీలో ఉప ఎన్నికలు నిర్వహించబోవడం లేదని స్పష్టం చేసింది. దీని పై లోకేష్ ఇలా ట్వీట్ చేసారు. "మధ్యలో ఎన్నికలు రావని తెలిసి, కేంద్రంతో రాజీ. ఆంధ్రా ప్రజలకు నామం పెడుతూ వైకాపా వేసిన రాజీనామా డ్రామా బట్టబయలైంది. లోపాయికారి ఒప్పందం బహిర్గతం అయ్యింది. ఆంధ్రా ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టాలి అని ప్రయత్నించిన కుయుక్తులకు ప్రజలే సమాధానం చెబుతారు."

lokesh 07102018 2

లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాల చివరిరోజు ఈ ఏడాది ఏప్రిల్‌ 6న వైసీపీ లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు తక్షణం ఆమోదం పొందితే తప్ప వారు ప్రాతినిథ్యం వహించిన స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాసం లేదు. ఆ తరువాత సరిగ్గా రెండు నెలలకు, ఈ ఏడాది జూన్‌ ఆరో తేదీన వైసీపీ ఎంపీల రాజీనామాను ఆమోదిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు ఏడాది లోపు అయితేనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కావాలని రెండు రోజులు ఆలస్యంగా రాజీనామాలను ఆమోదించిన కారణంగా, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరగబోవని అందరికీ తెలుసు.

lokesh 07102018 3

శనివారం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు లేవని ఈ సందర్భంగా చేసింది. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారాన్ని వ్యూహాత్మక తప్పిదంగా రాష్ట్ర రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు .. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఉదహరిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. ప్రత్యేక హోదాను కోరుతూ ప్రధాని మోదీ సర్కార్‌పై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానానికి కాంగ్రె్‌సతో సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని తెలుగుదేశం ఎంపీలతో సహా .. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇతర ముఖ్యనేతలూ దేశానికి తెలియజేశారు. ఈ సమావేశాల్లో వైసీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేశారు. సభలో టీడీపీ, ఇతర ఎన్డీయేతర పక్షాల సభ్యులు ప్రత్యేక హోదా సహా అనేక అంశాల్లో మోదీ సర్కారును ఎండగడుతున్న సమయంలో.. వైసీపీ ఎంపీలు తమ రాజీనామా కారణంగా ఆ విలువైన కాలమంతా లోక్‌సభ బయటే గడపాల్సి వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read