త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందని ఒపీనియన్‌ పోల్స్‌ ద్వారా తెలుస్తోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉందని, రాజస్థాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రి కావాలని అక్కడి ఓటర్లు కోరుకుంటున్నారని తెలిసింది. ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 15 ఏళ్ల తరువాత తిరిగి కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కనుంది. అలాగే, రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించే అవకాశం ఉంది.

bjp 07102018 2

200 అసెంబ్లీ సీట్లు ఉన్న రాజస్థాన్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి 142, భాజపాకు 56 సీట్లు దక్కుతాయని ప్రజాభిప్రాయ సర్వే ద్వారా తెలిసింది. మిగతా రెండు సీట్లు ఇతరులకు దక్కే అవకాశం ఉంది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వసుంధర రాజే కన్నా సచిన్‌ పైలట్‌‌ వైపునకే అధిక మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. అలాగే, మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కి 122 సీట్లు దక్కుతాయని, భాజపాకు 108 సీట్లు వస్తాయని సర్వే ద్వారా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కి 47, భాజపాకి 40 సీట్లు వస్తాయి. మిగతా మూడు ఇతరులకి రావచ్చు.

bjp 07102018 3

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, భాజపాలకు 42.2, 41.5 శాతం చొప్పున ఓట్లు వస్తాయని తెలిసింది. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో ఈ రెండు పార్టీలకు వరసగా 38.9, 38.2 శాతం చొప్పున ఓట్లు వస్తాయి. రాజస్థాన్‌లో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య భారీగా తేడా ఉండనున్నట్లు వెల్లడైంది. కాంగ్రెస్‌కి 49.9 శాతం ఓట్లు వస్తే, భాజపాకు 34.3 శాతం ఓట్లు పడనున్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భాజపా 165, 142, 49 సీట్లు గెలుచుకుని విజయభేరి మోగించింది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కి వరసగా 58, 21, 39 సీట్లు వచ్చాయి. ఈ సర్వేలో బీజేపీకి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కోలుకోలేని షాక్ తగలనుందని తేలింది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటి విజయం సాధించనుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read