ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ఫీవర్ మొదలైంది. మన పక్క రాష్ట్రం తెలంగాణాలో మరో నెలలో ఎన్నికలు అనే వాతావరణం ఉంది. ఈ టైంలో అనేక మంది అటూ ఇటూ పార్టీలు మారటం, కొత్త పార్టీలు రావటం, ఇవన్నీ సహజం. అయితే ఏపిలో మొదలైన కొత్త రాజకీయ పార్టీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా, ఆ పార్టీ పేరు వింటే అవాక్కవటం ఖాయం. ఈ పార్టీ పెట్టింది ఎవరో తెలుసా ? భార్య బాధితుల సంఘం బాధితిథులు. విజయవాడలో సమావేశమైన వారందరూ, పొలిటికల్ పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, భార్యల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని న్నారు.
ప్రస్తుతమున్న చట్టాలన్ని భార్యలకు అనుకులంగా ఉన్నాయి, భార్యల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి, అందుకే అందుకే భార్య బాధితులు సంఘాన్ని ఏర్పాటు చేశామని వారంటున్నారు. కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఆల్ ఇండియా భార్యా బాధితుల సంఘం ఏర్పాటు చేసుకున్నామన్నారు. భార్యలే కాకుండా అత్త , అడపడుచులు, వదిన మరదళ్లు , తోడికోడళ్ల బాధితులు ఇందులో ఉన్నారు. తమకోసం ఏ రాజకీయ పార్టీ పోరాడదు కనుక తామే సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని భార్య బాధితుల సంఘం సభ్యులు వ్యాఖ్యానించారు.
భార్యా బాధితులు, అత్త , అడపడుచులు, వదిన మరదళ్లు , తోడికోడళ్ల రాజకీయ పార్టీ పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేసారు. త్వరలోనే ఈ పార్టీ రిజిస్టర్ చేపిస్తామని అన్నారు. ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ భార్యా, అత్త , అడపడుచులు, వదిన, మరదళ్లు బారి నుంచి మమ్మల్ని కాపాడటం లేదని, మా గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని, ఎవరి తప్పు ఉన్నా, మగావారినే లోపల వేస్తున్నారని, మా గురించి అడిగే వారు లేరని, మా గురించి చట్టాలు లేవని, అందుకే ఇవన్నీ సాధించటం కోసం, కొత్త పార్టీ పెడుతున్నామని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, అందరం కలిసి పోరాడతామని అన్నారు. మొత్తానికి, కాదేదీ కవితకనర్హం అన్న చందాన, రాజకీయాలకు ఏదీ ఎవరు అతీతం కాదని నిరూపించారు భార్య బాధితుల సంఘం వారు.