తమ సమస్యల పరిష్కారించాలని కోరుతూ ఉత్తరాఖండ్‌కు చెందిన రైతులు పది రోజుల కిందట హరిద్వార్‌ నుంచి ఢిల్లీకి మహాపాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీలోకి ప్రవేశించకుండా దాదాపు 30వేల మంది రైతులను పోలీసుల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. పది రోజులుగా మహా పాదయాత్ర చేపట్టి దిల్లీకి చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళన చేస్తున్నారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయువు‌, జలఫిరంగులను‌ ఉపయోగిస్తున్నారు. దీంతో భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన వేలాది మంది రైతులు దిల్లీ- ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులో రోడ్లపై వేచి చూస్తున్నారు.

kisan 02102018 2

అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత నరేశ్‌ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ఇక్కడ(దిల్లీ-యూపీ సరిహద్దు) ఎందుకు ఆపారు? మేము క్రమశిక్షణతో శాంతయుతంగా నిరసన ర్యాలీ చేస్తున్నాం. మా సమస్యల గురించి ప్రభుత్వానికి కాకుండా ఎవరికి చెప్పాలి? పాకిస్థాన్‌కో లేదా బంగ్లాదేశ్‌కో వెళ్లిపోవాలా?’ అని ఆవేశంగా అన్నారు. కాగా ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదని దిల్లీ పోలీసులు చెప్తున్నారు. అయితే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రైతులను నగరంలోకి ప్రవేశించనివ్వండి... వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. వారిని అడ్డుకోవడం తప్పని పేర్కొన్నారు.

kisan 02102018 3

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని, రుణాలు మాఫీ చేయాలని, ఎన్సీఆర్‌లో పదేళ్లు పైబడిన ట్రాక్టర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఇంకా పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి సెప్టెంబరు 23న కిసాన్‌ క్రాంతి ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల మీదుగా అక్టోబరు 2న దిల్లీలోని కిసాన్‌ ఘాట్‌కు చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ వారిని పోలీసులు దిల్లీలోకి అనుమతించడం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read