సొంత డబ్బులతో వాటర్ బాటిల్ కొనుక్కుని, నీళ్ళు తాగుతున్నా, నీకు స్పెషల్ బాటిల్ ఉంది, మిగతా వారికి నార్మల్ బాటిల్ ఉంది అని, బూతద్ధంలో పెట్టి చూసే జగన్ పార్టీ నేతలకి, ఇలాంటి వార్తలు కనపడవు. తిరుపతి పర్యటనకు వెళ్ళాల్సిన ఐటి మంత్రి నారా లోకేష్, నిన్న రాత్రి విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్ లో బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి కొడుకు అయ్యి ఉండి, మంత్రి అయ్యి ఉండి, ఇలా ట్రైన్ లో వెళ్ళటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో ట్రైన్ లో మంత్రులు వెళ్ళటం చాలా అరుదు. కార్ ప్రయాణం చెయ్యలేని వారు, విమాన ప్రయాణం అవకాసం లేని ప్రజా ప్రతినిధులు మాత్రమే, ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. ఒక పక్క, రాష్ట్రంలో మావోల కదలికతో టెన్షన్ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో, లోకేష్ ట్రైన్ లో వెళ్ళటంతో, పోలీస్ శాఖ కూడా ఒకింత టెన్షన్ పడింది. విజయవాడ నుంచి తిరుమలకు ఫ్లిట్ ఉన్నా, టైం ఉంది, అవకాసం ఉంది కదా, ట్రైన్ కి వెల్లిపోదాం అని లోకేష్ చెప్పారు.

loesh 04102018 1

తిరుమలలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి, ఈఎంసీ-2లో నూతనంగా నిర్మించిన డిక్సన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ రెండో దశ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. దీంతోపాటు తిరుపతిలో షియామీ ప్రతినిధులతో సమావేశమై సంస్థ నూతనంగా ఉత్పత్తి చేసిన టీవీని ఆవిష్కరించనున్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆనుకుని ఇప్పటికే ఈఎంసీ-1(ఎలక్ట్రానిక్‌ పరికాల ఉత్పత్తి కేంద్రం), ఈఎంసీ-2లను ఏర్పాటు చేశారు. ఈఎంసీ-1లో సెల్‌కాన్‌ సంస్థ తమ చరవాణుల తయారీని ప్రారంభించాయి. సెవెన్‌హిల్స్‌ డిజిటల్‌, కార్బన్‌, ఐఅండ్‌ హెల్త్‌ కేర్‌లు తమ సైతం ముందుకు వచ్చాయి. రూ.150 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి కల్పిస్తూ డిక్సన్‌ మొదటి దశ కార్యకలాపాలను ఇప్పటికే నిర్వహిస్తోంది.

loesh 04102018 1

రెండో దశలో రూ.150 కోట్ల వ్యయంతో ఈఎంసీ-2లో డిక్సన్‌ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో టీవీలు, సీసీ కెమెరాలను తయారు చేయనున్నారు. దీన్ని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మొత్తం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమ స్థాపించారు. ఇక్కడ ఏడాదికి 2.4 మిలియన్‌ టీవీలు, 1.2 మిలియన్‌ సీసీ కెమెరాలను ఉత్పత్తి చేయనున్నారు. మరో 2.5 లక్షల చదరపు అడుగుల్లో పరిశ్రమను విస్తరించి వాషింగ్‌మెషీన్లు, ఎల్‌ఈడీ బల్బులు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. షియామీ సంస్థ నూతనంగా ఉత్పత్తి చేసిన 32, 43 అంగుళాల ఎంఐ స్మార్ట్‌ టీవీలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read