ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి అధికంగా ఖర్చు చేశారన్న కేసులో ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుకు హైదరాబాద్ లోని, ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోడెల 2014 ఎన్నికల్లో నిబంధనలకు మించి ఖర్చు చేశారంటూ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ పై, తెలంగాణాలో కేసు పెట్టటం ఒక విచిత్రం అయితే, దానికి నోటీసులు మరో విచిత్రం. ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన దానికి, హైదరాబాద్ కోర్ట్ కి, ఏపి స్పీకర్ రావటం కొంచెం విడ్డురంగా ఉంది.

kodela 04102018 2

తాను ఎన్నికల్లో సుమారు పదకొండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు, ఓ ఇంటర్వ్యూలో కోడెల చెప్పినందున విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కరీంనగర్ కోర్టు విచారణకు హాజరుకావాలని కోడెలను గతంలో ఆదేశించింది. అయితే కరీంనగర్ కోర్టు ఆదేశాల పై కోడెల శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు నాంపల్లిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో ఆ కేసు అక్కడికి బదిలీ అయింది. కోడెల స్టే పొంది ఆరు నెలలు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టే పొడిగించాలని హైకోర్టును కోరారు.

kodela 04102018 3

హైకోర్టులో పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రత్యేక కోర్టు ఈ నెల 10న విచారణకు రావాలని కోడెలను ఆదేశించింది. ఇంట్లర్వ్యూలో ఎన్నికల్లో పెరుగుతున్న వ్యయం గురించి వివరిస్తూ.. తాను రాజ‌కీయ ప్ర‌వేశం చేసినప్పుడు ఎన్నిక‌ల్లో రూ.30వేలు ఖ‌ర్చు చేశానని.. ఆ రూ.30వేలు కూడా గ్రామాల్లోని ప్ర‌జ‌ల నుంచి చందాల రూపంలో వ‌చ్చాయ‌న్నారు. తర్వాత ఖ‌ర్చు పెరుగుతుందని.. 2014లో తనకు రూ.కోట్లు ఖ‌ర్చయ్యిందన్నారు. ఈ వీడియో ఆధారంగానే తెలంగాణా కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఇప్పుడు కోడెల స్వయంగా రావాలి అంటూ నోటీస్ వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read