నిజామాబాద్ వేదికగా టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో విపక్షాలపై, మహాకూటమి పొత్తులపై తిట్ల దండకం అందుకున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... అయితే కేసీఆర్ తిట్ల పురాణం చూస్తే ఆయనలో ఎన్నికల భయం కనిపిస్తోందన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... 2009లో టీడీపీతో, 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం కేసీఆర్ మరిచారా? పిల్లి శాపనార్దాలకు ఉట్లు తెగుతాయా? కేసీఆర్ శాపనార్ధాలతో రాజకీయం మారుతుందా..? అంటూ మండిపడ్డారు.కేసీఆర్‌ గతంలో చెప్పిన మాటలు మరచిపోయారన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని గతంలో అన్నారని మంత్రి గుర్తుచేశారు.

kcr 004102018

తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయిందంటే కారణం చంద్రబాబేనన్న సోమిరెడ్డి... హైదరాబాద్ అభివృద్ధి జరిగిందంటే కారణం చంద్రబాబే.... బాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అని కేటీఆర్ గతంలో చెప్పిన మాటలు కేసీఆర్ మరచిపోయినట్టున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కేబినెట్‌లో సగం మందిది టీడీపీ బ్రాండే నని గుర్తు చేశారు సోమిరెడ్డి... ఆంధ్రులను తిడితేనే రాజకీయం చేయొచ్చనే కాలం చెల్లిందని... చంద్రబాబును తిడితే కేసీఆర్‌కు నష్టమే తప్ప... లాభం ఉండదన్నారు. ఇక రూ. 500 కోట్లు... మూడు హెలీకాప్టర్లను పంపాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేసిన ఏపీ మంత్రి... మా పోరాటం స్వచ్ఛంగా ఉంటుంది. తెలంగాణలో టీడీపీ లేదన్న కేసీఆర్ ఇప్పుడు టీడీపీని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

kcr 004102018

టీఆర్ఎస్ అంతా టీడీపీ బ్రీడే... ప్రధాని మోడీ దగ్గర నుంచి కేసీఆర్ వరకు అంతా చంద్రబాబుని చూసి భయపడిపోతున్నారని వెల్లడించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలంగాణ ఉన్నన్నాళ్లూ టీడీపీ ఉంటుందని.. నిరాశ, నిస్పృహలతోనే కేసీఆర్ తమ అధినేతపై ఆరోపణలు చేశారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని.. వాటని ప్రజలు హర్షించరని సోమిరెడ్డి అన్నారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో కేసీఆర్ ఎందుకు పొత్తుపెట్టుకున్నారని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read