ప్రచారం జరుగుతున్నట్టే, అమరావతిలో ఐటి అధికారులు విరుచుకుపడ్డారు. ఉదయం 5 గంటలకు సమావేశం అయిన ఐటి అధికారులు, మొత్తం ప్లాన్ చేసుకుని, కొద్ది సేపటి క్రితం ఆటోనగర్ ఐటి కార్యాలయం నుంచి వీళ్ళు బయలుదేరారు. ముందుగా ఫస్ట్ టార్గెట్ గా మంత్రి నారయణ పై దాడులు మొదలు పెట్టారు. ముందుగా మంత్రి నారయణ కాలేజీలు, ఆయాన ఇంటి పై దాడులు మొదలు అయ్యాయి. మరో బృందం గుంటూరు వెళ్ళింది. వీళ్ళు గుంటూరులో ఎవరి మీద దాడులకు వెళ్తున్నారో తెలియాల్సి ఉంది. స్థానిక పోలేసుల సహాయంతో, మంత్రి నారాయణ కాలేజీల పది దాడులు జరుగుతున్నాయి.

narayana 05102015 2

అయితే నారాయణ వ్యాపారాల పై దాడులు చేస్తున్నారా లేక పొతే, ఈయన శాఖ పై దాడులు జరుగుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. అందరూ అనుకున్నట్టే, దాడులు మొదలు అయ్యాయి. 16 మంది పై దాడులు చేస్తున్నాం అంటూ, ఐటి అధికారులు లీక్ ఇచ్చినట్టు సామాచారం. గుంటూరు జిల్లాలో ఒక కీలక నేత పై దాడులు చెయ్యబోతున్నాం అంటూ లీక్ ఇచ్చారు. ‘రాజధాని’ జిల్లాలు కృష్ణా, గుంటూరులో అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటున్న ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం! దీనికోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ సిబ్బంది సమాయత్తమైనట్లు చెబుతున్నారు.

narayana 05102015 3

ఎలాంటి ఆటంకాలు లేకుండా సోదాలు జరిపేందుకు వీలుగా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు యంత్రాంగాన్ని వీరు కోరినట్లు తెలిసింది. ‘‘ఒక అరగంట ముందు చెబుతాం! ఆ వెంటనే మీరు మాతోపాటు కలిసి రావాలి. బందోబస్తు కల్పించాలి’’ అని అడిగినట్లు సమాచారం! నిజానికి... అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే ప్రముఖులపై ఐటీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిజానికి... రెండు మూడు నెలలుగా రాజధాని జిల్లాలపై ఐటీ కన్నేసింది. రాజధాని ప్రాంతంలోని ఒకే సామాజిక వర్గానికి చెందినా, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలతో జాబితా రూపొందించుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read