తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలు కావటంతో,అన్ని రాష్ట్రాల్లో చేసినట్టే, ఇక్కడ కూడా కేంద్ర పెద్దలు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కెసిఆర్, మోడీకి పూర్తిగా లొంగిపోవటంతో, వీరి పని మరింత తేలిక అయ్యింది. అందుకే కెసిఆర్ కి కొరకారని కొయ్యగా తయారాయని రేవంత్ రెడ్డి పై, రాజకీయ కుట్ర మొదలు పెట్టారు. రేవంత్ ఇంట్లో లేని సమయంలో, తాళాలు బద్దులు కొట్టి మరీ లోపాలకి వెళ్లారు. ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక రాజకీయ నాయకుడితో ప్రవరిస్తున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డిని లొంగదీసుకోవటానికి, మిగతా వారిని బెదిరించటానికి. ఎవరో ఒక రౌడీ షీట్ అర్హుడైన ఉన్న వ్యక్తి, 32 కేసులు ఉన్న వ్యక్తి లెటర్ రాస్తే, ఐటి, ఈడీ వచ్చి మీద పడుతున్నాయి.
ఇది ఇలా ఉంటే, రేవంత్ మీద జరుగుతున్న దాడి పై, చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ఈ రోజు అమరావతిలో, తన అమెరికా పర్యటన వివరాలు చెప్తూ, విలేకరులు ఆడిగిన ప్రశ్నకు స్పందించారు. "కర్ణాటకలో ఏమి జరిగింది, తమిళనాడులో ఏమి జరిగింది, ఉత్తర్ ప్రదేశ్ లో ఏమి జరిగింది ? తెలంగాణాలో ఏమి జరుగుతుంది. వీళ్ళు దొంగలని పట్టుకోలేరు. నేరస్థులని పట్టుకోలేరు. ఇలా రాజకీయ కక్ష మాత్రమే చేస్తారు. నేను ఇక్కడ ఒక్క రేవంత్ అంశం మాట్లాడటం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారి అన్ని రాష్ట్రాల్లో వీళ్ళు చేసేది ఇదే. ఎన్నికల వచ్చిన ప్రతి రాష్ట్రంలో, కేంద్రం చేస్తున్న కుట్ర రాజకీయాలు ఇవే. అంతా చూస్తూనే ఉన్నారు వెళ్లు ఏమి చేస్తున్నారో" అంటూ చంద్రబాబు స్పందించారు.
మరో పక్క ఒక ఇంట్లో, రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒక చిన్న ఇల్లు, మూడు బృందాలుగా ఐటి అధికారులు, రెండు రోజుల నుంచి సోదాలు చెయ్యటానికి ఏమి ఉంటుంది ? అదీ ఒక రాజకీయ నాయకుడు ఇంట్లో. ఒక గంట రెండు గంటల్లో అయిపోయే సోదాలు, రెండు రోజులుగా జరుగుతున్నాయి అంటేనే, అక్కడ వాళ్ళకి ఏమి దొరకలేదు అని అర్ధమవుతుంది. అయినా, 15 సంవత్సరాలుగా ప్రతిపక్ష ఎమ్మల్యేగా ఉన్న రేవంత్ మొండి లాండరింగ్ చెయ్యటం ఏంటి ? అలా చేస్తే రాజశేఖర్ రెడ్డి అసలు వదిలి పెట్టే వాడా ? కెసిఆర్ 4 ఏళ్ళుగా చూస్తూ కూర్చునే వాడా ? ఎదో కక్ష సాధించి, భయపెట్టి, ఒక రెండు రోజుల హంగామా తప్ప, ఇలాంటి వాటితో ఏమి సాధించేది ఉండదు అని అందరికీ తెలుసు..