నిత్యం ఎదో ఒక సంచలన ఆరోపణలు చేస్తూ, గత మూడు రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్, ఈ రోజు కూడా మరో సంచలన ఆరోపణతో వార్తల్లో నిలిచారు.. నిన్నటి దాక, చంద్రబాబు, జగన్ పై ఆరోపణలు చేసిన పవన్, ఈ రోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల పైనే ఆరోపణలు చేసారు. రెండు రోజుల క్రితం పవన్ మాట్లాడుతూ, నన్ను చంపటానికి ముగ్గురు ప్లాన్ చేసారు, అది వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరో వీడియో తీసి నాకు పంపించారు అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీని పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ గోదావరి జిలా ఎస్పీ స్పందించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, మీకు భయం అవసరం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మీకున్న సమాచారం ఇవ్వండి, మీకు బధ్రత పెంచుతాం అని అన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిలా ఎస్పీ కూడా, ఆ ముగ్గురు ఎవరో చెప్పండి అంటూ, పవన్ కు ఉత్తరం రాసారు. ఈ ఇద్దరి వ్యాఖ్యల పై ఈ రోజు పవన్ స్పందించారు. అది కూడా ఎంతో వెటకారంతో. ముఖ్యమంత్రికి సమాధానం చెప్తూ, "ఉదయం ఎవరో పవన్ కళ్యాణ్ కి ఆపద ఉంటే సెక్యురిటి ఇస్తాం అని అంటున్నారు, మేము బయపడతామా, నేను సినిమా హీరోను కాదు, ఉద్యమకారున్ని, నన్ను నేను రక్షించోగలను" అని పవన్ అన్నారు.
అంతే కాదు, మీరు బధ్రత ఎందుకు పెంచతాం అంటున్నారో నాకు తెలియదా ? ఆ పేరు చెప్పి, నా రహస్యాలు అన్నీ రాబడతారా ? మొన్న సెక్యూరిటీ ఇచ్చి మీరు చేసింది అదే కదా. నేను హైదరాబాద్ లో ఉంటే, నా ఇంటి పై, ఆఫీస్ పై, అర్ధరాత్రి వేళలో డ్రోన్ పంపించి నిఘా పెట్టారు, దానిమీద మా వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు" అంటూ పవన్ మరో సంచలన ఆరోపణ చేసారు. ఇక్కడ ఎవరికీ అర్ధం కానిది ఏంటి అంటే, ఏ రాజకీయ పార్టీ నాయకుడు అయినా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఆఫీస్ అయినా, పగలు పూట పని చేస్తారు, వివిధ వ్యక్తులతో మాట్లడతారు. ఒకవేళ పవన్ చెప్పింది నిజమే అయితే, పొలిటికల్ ఇంటలిజెన్స్ ప్రభుత్వ చేస్తే, ఆ పని పగలు పూట చేస్తారు కాని, రాత్రి పూట డ్రోన్లు పంపిస్తే, ఏమి ఉంటుంది ? పవన్ కళ్యాణ్ అర్దారాత్రి మాత్రమే ముఖ్యమైన పనులు చేస్తారేమో.. ఇలాంటి చౌకబారు ఆరోపణలు రోజికి ఒకటి చేసి, ప్రజలకు కామెడీ పండించటం తప్ప, పవన్ సాధించేది ఏంటి ?