మన రాష్ట్రం లో గ్రూప్ 1 టాపర్ అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి జీవితంను, అవినీతిలో ముంచి సర్వ నాశనం చేసిన మన ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చరిత్ర గుర్తుందా ? ఆమె జైలు, ఆసుపత్రుల చుట్టూ తిరుగింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఐఎఎస్. రత్న ప్రభ, బిపి ఆచార్య లాంటి ఐఏఎస్ ఆఫీసర్లని, జైలు చుట్టూ తిప్పాడు.. అయితే చంద్రబాబు పరిపాలనలో మాత్రం అందుకు భిన్నం. జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్లు, మన రాష్ట్ర ప్రభుత్వం తరుపున అవార్డ్ లు అందుకుంటున్నారు. తాజగా ఐఏఎస్ ఆఫీస్ అహ్మద్ బాబు, అమెరికాలో మన రాష్ట్రం తరుపున అవార్డ్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)కి ప్రఖ్యాత హిటాచీ సంస్థ పీపుల్స్ ఛాయిస్ అవార్డు లభించింది.
అమెరికాలోని శాన్ డిగోలో హిటాచీ నెక్ట్్స-2018 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగం ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బాబు.ఏ లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ, ఆర్టీజీఎస్ సలహాదారు హరిప్రసాద్‌లు కూడా పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుని రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం 5 కోట్లమందిప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఆ సంస్థ అందజేసింది. పీపుల్ ఫస్ట్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందని ఆ సంస్థ ప్రశంసించింది.
360 డిగ్రీస్ అప్రోచ్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ పనిచేస్తూ సత్ఫలితాలు సాధిస్తోందని తెలిపింది. ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులు, సమస్యలను సులభంగా పరిష్కరించడమే కాకుండా, రాష్ట్రంలో జరుగుతున్న మౌలికసదుపాయల కల్పన పనులు, ప్రాజెక్టుల ప్రగతిని పర్యవేక్షిస్తోందని, అలాగే రాష్ట్రంలో ఏదైనా సంఘటలను జరిగినా వాటిని పర్యవేక్షించి పరిష్కరిస్తోందన్నారు.వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టి సాంకేతిక సదుపాయంతో ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తోందని తెలిపింది. ఆర్టీజీ వివిధ మార్గాల ద్వారా సేకరించి నిక్షిప్తం చేసిన బిగ్ డాటా వల్ల ప్రజలకు పారదర్శకలతో కూడిన సేవలను అందించడానికి అనువైన నిర్ణయాలు తీసుకోవడం సులభంగా మారిందని తెలిపింది. అనంతరం జరిగిన ప్యానట్ డిస్కషన్స్‌లో ఆర్టీజీఎస్ సీఈఓ బాబు.ఏ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అవార్డు వివరాల కోసం http://www.hitachinext.com/en-us/transformation-award-2018.html వెబ్సైట్ లింక్‌ను సందర్శించగలరు.