ఓ పక్క వర్షం, మరోపక్క కాలినడక ...ఆ శ్రమ ఆంధ్రులకు మేలు చేకూర్చాలనే... ఇక్కడ , అక్కడని లేదు ..ఎక్కడైనా పని పని... తనని నమ్ముకున్న అయిదున్నర కోట్ల ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న కష్టానికి ప్రత్యక్ష్య తార్కాణం ఈ ఫోటోలు ... ఇరవై ఏళ్ల క్రితం... నాడు అమెరికాలో ఫైళ్ళు పట్టుకుని అనేక కార్పోరేట్ కార్యాలయాలకు వెళ్లి హైదరాబాద్ లో ఐటీ సంస్థలను నెలకొల్పాలని బలపం కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సఫలీకృతులయ్యారు... మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థ అధిపతి బిల్ గ్రేట్స్ అపాయింట్ మెంట్ సంపాదించడమనే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసుకుని... పది నిమిషాల సమయాన్ని గంటల పాటు కేటాయించేలా తన వాగ్దాటితో సద్వినియోగం చేసుకుని అసాధ్యుడనిపించుకున్నారు...

cbn ny 25092018 2

ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి , వయసు అరవై ఎనిమిది... కుటుంబసభ్యులతో ముఖ్యంగా మనవడితో ఆడుకోవాల్సిన తరుణం.. కాలు తీసి కాలు కదపాల్సిన పని లేదు... పిలిస్తే వాహనాలు క్యూగడతాయి... అయినా వయసు ఏదైనా మిగిలిన వారికి ఉత్సాహం, ప్రోత్సాహం అందించడంలో ఆయనకు ఆయనే సాటి ...యుద్ధమైనా , ఉద్యమంలోనైనా ముందుండి నడిపించేవాడే అసలైన, నిజమైన, నిఖార్సయిన నాయకుడు, పాలకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమె .. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఈ రోజు వర్షంలో తడుస్తూ, తన పర్యటన కొనసాగిస్తున్నారు.

cbn ny 25092018 3

తను బస చేసిన హోటల్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో సమావేశంలో పాల్గొడానికి సుమారు కిలోమీటర్ నడచి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల బృందం. న్యూయార్క్ లో జరుగుతున్న ‘సుస్థిర అభివృద్ధి ప్రభావ సదస్సు (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ సమ్మిట్)లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గున్నారు. ‘శీఘ్ర సుస్థిర ఉత్పాదకత సాధన’ అనే అంశంపై ఏపీఈడీబీ (ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి)తో కలిసి ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సంయుక్త పత్రం విడుదల చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read