గత ఆరు నెలల నుంచి, ఒకడి తరువాత ఒకడు, చంద్రబాబు పై విషం చిమ్మటం కోసం పోటీ పడటం, చంద్రబాబు అవినీతి పరుడుగ ముద్ర వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చెయ్యటం, చివరకు విపి అవ్వటం, ఇదే తంతు... ఇన్ని ఆరోపణలు, ఇంత హంగామా చేసి చివరకు ఒక్క రూపాయి అవినీతి ఇప్పటి వరకు ప్రూవ్ చెయ్యలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లడటం, ప్రజల్లో ఏవో అపోహలు కలిగించటం, చెప్పిందే చెప్తే ప్రజలు నిజం అని నమ్ముతారేమో అని ఆశ... మీడియా ముందు చేసారు అంటే అర్ధం ఉంది, చివరకు కోర్ట్ లు దగ్గర కూడా, ఇవే గాల్లో ఆరోపణలు చేస్తే కోర్ట్ లు ఊరుకుంటాయా ?

court 26092018

ఈ రోజు అదే జరిగింది... గత వారం రోజుల నుంచి జగన్ బ్యాచ్, సాక్షి టీవీ ఒకటే హంగామా... ఎవరో హైకోర్ట్ లో చంద్రబాబు, లోకేష్ అవినీతి చేసారంటూ కేసు వేసారు, ఇక చంద్రబాబు జైలుకు వెళ్తారు అంటూ, ఇలా ఒకటే హంగామా.. అసలు వీళ్ళు వేసిన పిటీషన్ ఏంటి అయ్యా అంటే, చంద్రబాబు, లోకేష్ కలిసి ఐటి శాఖలో 25 వేల కుంభకోణం చేసారు అంట.. అసలు ఐటిలో ఇంత పెద్ద కుంభకోణం చెయ్యటానికి, అక్కడ ఏమి ఉంటుంది ? ప్రతివాదులుగా చంద్రబాబు, లోకేష్ లతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఏపీఎన్నార్టీ సొసైటీ ఛైర్మన్ వేమూరి రవికుమార్ లను చేర్చారు. అయితే, ఇలాంటి పస లేని కేసు పట్టుకుని ఒకటే హడావిడి చేసింది జగన బ్యాచ్..

court 26092018

ఈ పిటీషన్ ఈ రోజు హైకోర్ట్ ముందుకు వచ్చింది. అందరూ అనుకున్నట్టే, ఈ కేసు అసలు హైకోర్ట్ అడ్మిట్ కూడా చేసుకోలేదు. చివరకు హైకోర్టుకు ఎక్కిన పిటిషనర్ శ్రవణ్‌కుమార్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని, పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు హైకోర్టు చెప్పింది. దీంతో కేసు కొట్టేయక ముందే, శ్రవణ్‌కుమార్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం, ఇది ఒక పనికిరాని కేసు అని, కోర్ట్ లో ఇలాంటివి అసలు నిలబడవు అని అన్నారు. ఆధారాలు చూపించకుండా, ఆరోపణలు చేస్తే, ఇలాగే ఉంటుందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read