చైనా ప‌ర్య‌ట‌న‌కు లోకేష్‌ని ఎవ‌రూ పిల‌వ‌లేద‌ని, రూ.30 కోట్లు ఖ‌ర్చు పెట్టి స్లాట్‌ కొనుక్కున్నాడు అంటున్న క‌న్నా..! ఈ విష‌యాలు ఒక్క‌సారి ప‌రిశీలించు. అప్పుడు తేల్చుకో అజ్ఞాని ఎవ‌రో నీ``క‌న్నా``? తేదీ 06-06-2018న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం మంత్రి నారా లోకేష్ కి పంపిన ఆహ్వానం ఇది. దీని సారాంశం ఏంటంటే! పెద్ద‌లు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గారూ! వ‌రల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఆధ్వ‌ర్యంలో న్యూ చాంపియ‌న్స్ 12వ వార్షిక స‌మావేశాలు చైనాలోని టియాంజిన్‌లో సెప్టెంబ‌ర్ 18,19,20 తేదీల‌లో జ‌ర‌ప‌త‌ల‌పెట్టామ‌ని దీని సారాంశం. చైనా ప్ర‌భుత్వం, చైనా నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ రిఫార్మ్ క‌మిష‌న్ స‌హ‌కారంతో జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశాలలో నాలుగో పారిశ్రామిక విప్ల‌వానికి సంబంధించిన కీల‌క‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాన్ని ఐటీ, ఎల‌క్ర్టానిక్స్ రంగాల అభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తున్న మీ ఆలోచ‌న‌లు పంచుకునేందుకు స‌మావేశాల‌కు రావాల‌ని ఆహ్వానించారు.

lokesh 25092018 1

ప్ర‌పంచ‌వ్యాప్తంగా, 2000 మంది వివిధ‌రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని పేర్కొన్నారు. ఇదండి క‌న్నాగారు వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఆహ్వానంలోని సారాంశం. మీకు ఇంగ్లీష్ స‌మ‌స్య ఉంద‌ని తెలిసి అనువ‌దించి ఇచ్చాం. ఇందులోనూ త‌ప్పుగా మేం అనువ‌దించామ‌ని మీరు అనుకుంటే మీ కేంద్రానికి పంపించి చెక్ చేయండి. అనువాదం స‌రిపోయిందా? వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఇన్విటేష‌న్ యేనా? అనేవి కూడా నిర్ధారించుకోండి. ఆహ్వానం రాలేదు..స్లాట్ కొనుక్కున్నార‌నే విష‌యంపై ఇప్ప‌టికే మీకో క్లారిటీ వ‌చ్చింద‌నుకుంటా! రూ.30 కోట్లు వృథా చేశారంటున్నారు క‌దా! వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం వేదిక‌గా నారా లోకేష్ చేసిన ప్ర‌సంగం..ఓ సారి వినండి. అయ్యో సారీ అండి. మీకు ఇంగ్లీష్ స‌మ‌స్య క‌దా! ఇది కూడా తెలుగులో పారాడ‌బ్ చేయించి పంపుతున్నాం చ‌దువుకోండి..

lokesh 25092018 1

వరల్డ్ ఎకనామిక్ ఫోరం మూడో రోజు మంత్రి నారా లోకేష్ ఎమర్జింగ్ టెక్నాలజిస్,నాలుగోవ పారిశ్రామిక విప్లవం, తదితర అంశాలపై జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి,అమలు చేస్తున్న టెక్నాలజీ,టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం వంటి అంశాలను ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మంత్రి నారా లోకేష్ వివరించారు. దాదాపు వంద ప్ర‌ముఖ ఎల‌క్ర్టానిక్స్ త‌యారీ, ఐటీ సేవ‌లు అందిస్తున్న కంపెనీల ప్ర‌తినిధుల‌తో లోకేష్ భేటీ అయ్యారు. తిరుప‌తిలో టీసీఎల్ కంపెనీ వెయ్యి కోట్ల‌కు పైగా పెట్టుబ‌డి పెట్టి సంస్థ కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నుంది. అస్ర్త‌మ్‌తోపాటు మ‌రో 3 కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఎల‌క్ర్టానిక్స్ త‌యారీలో రారాజుల్లాంటి సంస్థ‌లు ఏపీకొచ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశాయి. రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్నెన్స్‌కు హువావే స‌హ‌కారం అందించేందుకు ఒప్పించారు. ఆహ్వానం డౌట్‌, రూ.30 కోట్ల లెక్క అన్నీ తీరిపోయాయా?

lokesh 25092018 1

నిన్న జీవీఎల్‌..నేడు మీరు..మీ అజ్ఞానాన్ని బ‌య‌ట‌పెట్టుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రువు తీస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఐక్య‌రాజ్య‌స‌మితిలోనూ, ఏపీ మంత్రి నారా లోకేష్ వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం వేదిక‌పైనా ప్ర‌సంగించ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వం. ప్ర‌శంసించాల్సిన త‌రుణంలో ఏపీపై అక్క‌సును ఇలా అవాస్త‌వాల‌తో వెళ్ల‌గ‌క్క‌డం న్యాయ‌మేనా? కేంద్రం నిధులిస్తోంద‌ని అంటున్నారు. ఏం ఏం నిధులిస్తోంద‌య్యా? వెన‌క‌బ‌డిన జిల్లాల‌ల‌కు ఇచ్చిన నిధులు వెన‌క్కి తీసుకున్న సంగ‌తా? ఉపాధి హామీ నిధుల‌కు అడ్డంకులు సృష్టిస్తూ ఆపేసిన విష‌య‌మా? ప్ర‌త్యేక హోదా ఎత్తేసిన కేంద్ర‌మేనా నిధులు ఇస్తోంది? చ‌ట్టంలో ఉన్న రైల్వేజోన్ పై మాట తిర‌గేసిన కేంద్ర‌మేనా మీరు చెబుతున్న నిధులిస్తోంది? అయ్యా మీరు చెబుతున్న కేంద్రం నిధులు ఎప్పుడు ఇచ్చింది? ఎంత ఇచ్చిందో ఒక్క‌సారి లెక్క‌లు చెప్పండ‌య్యా? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీర‌ని అన్యాయం చేసిన కేంద్రాన్ని..ఒక ఏపీ వాసిగా, ఏపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడిగా ఖండించాల్సింది పోయి..కేంద్రం ఆడించిన‌ట్టు ఆడుతూ స్వ‌రాష్ర్టానికే ద్రోహం చేస్తున్న మీరు..

lokesh 25092018 1

దార్శ‌నికుడు, ప్ర‌గ‌తికార‌కుడు అయిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఐటీలో జీరో నుంచి హీరో స్థాయికి ఏపీని చేర్చిన యువ‌నాయ‌కుడు లోకేష్‌ని విమ‌ర్శించేది? ప్ర‌తీసారి కేంద్రం నిధులిచ్చిందీ అంటున్నారు. కేంద్రంలోని మీ మంత్రులేమో అన్ని రాష్ర్టాల‌తోపాటు వ‌చ్చే వాటాగానూ, చ‌ట్ట‌ప‌రంగానే నిధులిస్తున్నాం అని చెబుతున్నారు. మ‌రి ప‌న్నులు రూపంలో ఆదాయం తీసుకుంటున్న కేంద్రం రాష్ర్టాల‌కు నిధులు ఇవ్వ‌డం విత‌ర‌ణా? విరాళ‌మా? ఒక సీనియ‌ర్ నాయ‌కుడిగా, చాలా పార్టీలు మారిన నేత‌గా మీ అనుభ‌వంతో మాట్లాడి చెప్పండి.. ఒక చైనా ప‌ర్య‌ట‌న‌కు వృథాగా రూ.30 కోట్లు ఖ‌ర్చు చేశారా? లెక్క‌లు ఇవ్వండి. వారంరోజులు తిండీ, నిద్రాలేకుండా ప్ర‌ముఖ కంపెనీల సీఈవోల‌తో భేటీలు, చ‌ర్చ‌లు..తిర‌గ‌ని ప‌రిశ్ర‌మ లేదు. వేల కోట్ల పెట్టుబ‌డుల‌తో వ‌చ్చేందుకు కంపెనీల‌ను ఒప్పించిన యువ‌చాతుర్యం, దార్శ‌నిక‌త‌ని విమ‌ర్శించ‌డానికి కొత్త స‌ల‌హాదారుల‌ను పెట్టుకోండి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రించ‌డం మానండి. మీ పాత‌కాల‌పు కుయుక్త‌, కుట్ర‌పూరిత‌, నేర‌పూరిత అవాస్త‌వ పంథాను వీడండి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read