చంద్రబాబు, లోకేష్ పై సిబిఐ వెయ్యాలి అంట.. దీనికి సంబంధించి, ముందడుగు ప్రజాపార్టీ అధ్యక్షుడు జె.శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. గత నాలుగేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ సంపాదించిన ఆస్తులపై దర్యాప్తు చేయించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని మాజీ న్యాయాధికారి. ఏపీలో ఐటీ అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పరిశ్రమలకు వేలాది ఎకరాలు స్కాం చేసిన చంద్రబాబు, లోకేష్ లు రూ. 25 వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారంటూ పిటిషన్ లో ఈ వ్యక్తి రాసాడు.
అర్హత లేకపోయినా నూతన ఐటీ కంపెనీలు/పరిశ్రమలకు అనుమతులిచ్చారు. ఆ కంపెనీలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రోత్సాహకాల (ఇనెసెంటివ్స్) రూపంలో ఇవ్వడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పిటీషన్ సారంశం. ప్రతివాదులుగా చంద్రబాబు, లోకేష్ లతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఏపీఎన్నార్టీ సొసైటీ ఛైర్మన్ వేమూరి రవికుమార్ లను చేర్చారు. లోకేష్ ఐటీ మంత్రి అయిన తర్వాత తన సమీప బంధువు రవికుమార్ ను ఐటీశాఖ ముఖ్య సలహాదారుడిగా, ఏపీఎన్నార్టీ ఛైర్మన్ గా నియమించారని పిటిషన్ లో ఆరోపించారు.
అయితే ఈ కేసు రేపు హైకోర్ట్ పరిగణలోకి తీసుకుని, అసలు ఇది విచారణ చేయ్యదగ్గిందా, రాజకీయ ప్రేరేపిత పిటీషనా అనేది తేల్చనుంది. అసలు ఐటి శాఖలో 25 వేల కోట్లు స్కాం ఏంటో, ఆ పిటీషన్ వేసిన వ్యక్తులకే తెలియాలి. అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం, ఇది ఒక పనికిరాని కేసు అని, కోర్ట్ లో ఇలాంటివి అసలు నిలబడవు అని అంటున్నారు. నరేంద్ర మోడీ, గత ఆరు నెలలుగా, చంద్రబాబుని ఎదో ఒక కేసులో ఇరికించటానికి, అన్ని విధాలుగా ప్రయత్నం చేసి, ఏ ఆధారం దొరక్క, బాబ్రీ లాంటి కేసుల్లో నోటీసులు ఇచ్చేలా చేసారని, ఇది కూడా రాజకీయ నేపధ్యంలో వేసిన కేసు అని, అంటున్నారు.