ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ‘నామినేట్’ చేసినట్టు తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసాయి సౌందర రాజన్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద’’ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీ ఈ పురస్కారానికి అర్హుడని ఆమె పేర్కొన్నారు. ఓ ప్రయివేటు యూనివర్సిటీలో నెఫ్రాలజీ విభాగం హెడ్‌గా, సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న తన భర్త డాక్టర్ పి. సౌందరరాజన్ కూడా మోదీ పేరును నోబెల్‌కు నామినేట్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఈమేరకు తమిళనాడు బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘2019 నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును తమిళిసాయి సౌందరరాజన్ నామినేట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ కేర్ పథకం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు..’’ అని బీజేపీ వెల్లడించింది. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం ఆయన దార్శనికతకు నిదర్శనమనీ.. కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపుతుందని పేర్కొంది. ‘‘2019 నోబెల్ శాంతి బహుమతి నామినేషన్లకు జనవరి 31 వరకు గడువు ఉంది. ప్రతియేటా సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, పార్లమెంటు సభ్యులు సహా ఇతరులు కూడా ప్రధానమంత్రిని నామినేట్ చేయవచ్చు...’’ అని తమిళనాడు బీజేపీ పేర్కొంది.
అయితే, దీని పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదేదో మోడీ త్యాగం చేసినట్టు, ఆయాన సొంత ఆస్థి ఎదో రాసిచ్చినట్టు, ఇంత హడావిడి ఎందుకని విపక్షాలు అంటున్నాయి. ఈ దేశంలో ఎంతో మంది ప్రధానులు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసరాని, ఎవరూ ఇలా చెయ్యలేదని చెప్తున్నాయి. ప్రధాని పదవి అనేది బాధ్యత అని, ఒక పధకానికి ఆయన పేరు పెట్టుకుని, దానికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వమని కోరటం ఏమిటో అర్ధం కావట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. మోడీ, అమిత్ షా ఎంత శాంతి కోరుకునే వారో, గుజరాత్ నర మేధం చూస్తే తెలుస్తుందని, ఇలాంటివి మాని, దేశాన్ని కుదిపేస్తున్న, రాఫెల్ కుంభకోణం పై స్పందించాలని కోరుతున్నారు.