బాబ్లీ కేసులో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఏపీ కేబినెట్‌లో వాడీ వేడి చర్చ జరిగింది. ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాలా వద్దా అనే అంశం పై మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. దీని పై అడ్వకేట్ జనరల్, సీనియర్ మంత్రులతో శనివారం చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే ర్యాలీగా కోర్టుకు హాజరైతే బాగుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు సూచించినట్టు తెలుస్తోంది. వారెంట్ రీకాల్ చేయకపోతే ఎలా అని సీనియర్ మంత్రి యనమల ప్రశ్నించగా, అడ్వేకేట్ జనరల్, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

babli 06102018 2

మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టుకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు మొగ్గు చూపగా కొం దరు మంత్రులు వారించారు. ఈ నెల 15న కోర్టుకు హాజరుకావాలని సీఎం సహా మరో 14 మందిని న్యాయమూర్తి ఆదేశించారు. బాబ్లీ పోరాటానికి సంబంధించి ఈ కేసు విచారణపై సీఎం సమక్షంలో శుక్రవారం చర్చ జరిగింది. తుది నిర్ణయం జరగలేదు. అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ శనివారం వస్తున్నందువల్ల ఆయన అభిప్రాయం తీసుకొని ఒక నిర్ణయానికి రావాలని అనుకొన్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశానికి ముందు కొందరు మంత్రులతో చంద్ర బాబు సమావేశం అయ్యారు.

babli 06102018 3

ఇందులో ధర్మాబాద్‌ కోర్టు అంశం ప్రస్తావనకు వచ్చింది. శనివారం మరోసారి చర్చించి ఒక నిర్ణయానికి రావాలని నిశ్చయించారు. అయితే శనివారం ఈ విషయం పై అడ్వకేట్ జనరల్ తో చర్చించారు. ఆయన సూచన మేరకు మరో సారి ఈ కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని సీఎం నిశ్చయించుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం కోర్ట్ కి వెళ్తేనే మంచిదనే అభిరయంలో ఉన్నా, న్యాయవాదుల అభిప్రాయం మేరకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ కేసు దొరక్క, 8 ఏళ్ళ నాటి కేసుతో సాధించటానికి వచ్చారని, మనం కూడా అలాగే ఎదుర్కుందామని, ప్రజలకు అన్ని విషయాలు అర్ధమయ్యేలా చెప్దామని, చంద్రబాబు అన్నట్టు తెలుస్తుంది. తెలంగాణా తెలుగుదేశం నేతలు కూడా, మీరు కోర్ట్ కి కనుక వెళ్తే, ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున రైతులు మీతో పాటు వస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే, ఇదంతా మోడీ ట్రాప్ అని, కోర్ట్ కి వెళ్తే అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని, ఆచి తూచి అడుగులు వెయ్యాలని, కొంత మంది మంత్రులు చంద్రబాబుతో అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read