తెలంగాణ అపద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మూడో కన్ను తెరవడానికి దెయ్యానివా.. రాక్షసుడువా? అని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్న తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రిది నోరా లేక మున్సిపల్ డ్రైనేజా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనన్నారు. అవన్నీ మరిచిపోయి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేలా బీజేపీతో కలిసి టీడీపీ పతానానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. వెల‌గ‌పూడి స‌చివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ఇష్టారాజ్యంగా సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయాల్లో దిగుజారుడుతనానికి కేసీఆర్ తీరు పరాకాష్ట అని అన్నారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సభ్యత సంస్కారం మరిచి టీఆర్ఎస్ అధినేత ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదన్నారు.

kcr 06102018 2

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా పదేళ్లు పనిచేసిన చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం సబబుకాదన్నారు. టీడీపీలో కేసీఆర్ ఉన్నప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. తెలంగాణాలో టీడీపీకి ఆఫ్ పర్సంటేజీ ఓట్ల శాతం మాత్రమే ఉందని కేసీఆర్ అంటున్నారని, అటువంటప్పుడు తమ పార్టీని చూసి ఆయనెందుకు భయపడాలని ప్రశ్నించారు. గురువారం జరిగిన ఎన్నికల సభలో గంట పాటు కేసీఆర్ మాట్లాడితే అందులో అరగంట పాటు టీడీపీ, చంద్రబాబు గురించి మాట్లాడారన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని తెలిపారు. మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆయన టీఆర్ఎస్ పార్టీని స్థాపించే వారా? అని ప్రశ్నించారు. మూడో కన్ను తెరిస్తే, చంద్రబాబు నాయుడు భగ్గుమని మాడిపోతారని కేసీఆర్ అంటున్నారని, ఆయనేమైనా దెయ్యమా…రాక్షసుడా? అని అన్నారు.

kcr 06102018 3

రాబోయే ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ పార్టీకి సీఎం చంద్రబాబు డబ్బులిస్తున్నారని కేసీఆర్ అనడం సరికాదన్నారు. 2009 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు కాళ్ల ముందు ఇదే కేసీఆర్ సాగలబడి, టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు తమకేమైనా డబ్బులిచ్చావా? అని మంత్రి నక్కా ఆనందబాబు నిలదీశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో తెలంగాణాలో ఏమి అభిచేశావో చెప్పాలని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. "తెలంగాణలో మహా కూటమికి భయపడే కేసీఆర్‌ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. నోటి దురుసు ఎక్కువై లేనిపోని మాటలంటున్నారు. వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడటం కేసీఆర్‌కు కొత్తేంకాదు. తమ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై ఐటీ దాడులు చేయించడం భాజపాకు సాధారణమైపోయింది" అంది మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read