విద్యుత్‌ చట్టం-2003లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డి కుమారస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మిజోరాం ముఖ్యమంత్రి లాల్ ‌తన్హ‌వ్‌లా,

kejriwal 06102018 2

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌లకు లేఖలు చేసి పలు విషయాలను ప్రస్తావించారు. విద్యుత్‌ చట్టం-2003లో మార్పులు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయని కేజ్రీవాల్ ఆ లేఖల్లో పేర్కొన్నారు. వీటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, విద్యుత్‌ రంగం పూర్తిగా కేంద్ర సర్కారు చేతిలోకి వెళ్లిపోతుందని, విద్యుత్ ధరలు పెరిగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

kejriwal 06102018 3

‘కొన్ని సంస్థలకు లాభాలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందడానికి వీల్లేదు. విద్యుత్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చే ప్రయత్నాన్ని పార్లమెంటులో మనం అందరం కలిసి అడ్డుకోవాల్సి ఉంది. ఈ బిల్లు వల్ల సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయనే విషయాలను మనం ప్రచారం చేయాల్సి ఉంది’ అని ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ అంశాలపై చర్చించడానికి తాను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలనుకుంటున్నానని ఆయన తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read