హైదరాబాద్, కర్నూలు జిల్లాలోని ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం పెట్టి, కాంగ్రెస్ కంటే ఘోరంగా, నరేంద్ర మోడీని ఇరుకున పెట్టిన దగ్గర నుంచి, మోడీ, తెలుగుదేశం పార్టీ కక్ష కట్టారనే ప్రచారం, జాతీయ స్థాయిలో కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సియం రమేష్ ఇంటి పై ఐటి దాడుల నేపధ్యంలో, ఆయనకు అనుకోని మద్దతు లభించింది. జాతీయ పార్టీ సీపీఐ నేత సురవరం సుధాకర్, ఢిల్లీలోని రమేష్ నివాసానికి వెళ్లి ఆయనకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో సిపిఐ, పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్తూ, ఇక్కడ విమర్శలు చేస్తున్నా, జాతీయ స్థాయిలో మాత్రం చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు.

ramesh 121020008 2

ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ బీజేపీని విభేదిస్తున్నవారి పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. స్వతంత్ర సంస్థలను కేంద్రం వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎవరన్నా ప్రశ్నిస్తే మోడీ తట్టుకోలేక పోతున్నారని అంటున్నారు. మరో పక్క, తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న ఐటీ దాడులపై పలువురు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో జరిగేవి ఐటీ దాడులు కావని... కక్ష సాధింపు దాడులని ప్రభుత్వ విప్‌ బుద్ధా వెంకన్న విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట మార్గాన్ని ఎన్నుకున్నందుకే తమ పార్టీ నేతలు ఈ దాడులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిజాయితీగా ఉన్న తాము ఇటువంటి దాడులకు భయపడమని స్పష్టం చేశారు.

ramesh 121020008 3

ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గుర్తిస్తున్నారని, ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ఏకం కావాల్సిన తరుణమిదేనని అభిప్రాయపడ్డారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై దాడులు జరిగితే అసలు అక్రమాలు బయటపడతాయని అన్నారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా మోదీ, అమిత్‌షా అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై నిలదీసినందుకే ప్రధాని నరేంద్రమోదీ ఏపీపై కక్ష కట్టారని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు కేంద్రం చేస్తున్న కుట్రలో భాగమేనని మరో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. తమిళనాడు, కర్ణాటక, యూపీ, దిల్లీలోనూ రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నికల ముందు ఇదే రీతిలో కేంద్రం దాడులు చేయించి ఘోరంగా దెబ్బతిందని దుయ్యబట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read