కొత్త ఛీఫ్ జస్టిస్ రావటంతోనే, బీజేపీకి బాంబు పేలింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య రగులుతున్న వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. ఈ నెల 10న వీటి పై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. తొలి పిటిషన్‌ను సుప్రీంకోర్టు లాయర్ వివేక్ ధండా దాఖలు చేశారు. ఈ ఒప్పందం తాలూకు వివరాలతో పాటు ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాల ఒప్పందాల మధ్య ధరల వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్‌లో ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని వివేక్ కోరారు.

rafael 08102018

యూపీఏ హయాంలో రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు, ఎన్డీయే హయాంలో విమానాల కొనుగోలుకు ఎంత కేటాయించారనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా న్యాయవాది వినీత్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు రిలయన్స్‌, డసో ఏవియేషన్‌ మధ్య ఈ ఒప్పందం ఏ విధంగా జరిగిందో తెలపాల్సిందిగా కోరారు. ఫ్రాన్స్‌ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ డిఫెన్స్ మధ్య జరిగిన ఒప్పందం వివరాలు కూడా వెల్లడించాలని ఆయన కోరారు. కాగా ఈ యుద్ధ విమానాల ఒప్పందాల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయంటూ మరో న్యాయవాది ఎమ్ఎల్ శర్మ ఇంతకు ముందే సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.

 

rafael 08102018

రాజ్యాంగంలోని 253 అధికరణాన్ని ఈ ఒప్పందం ఉల్లంఘిస్తోందనీ... ‘‘అవినీతిమయమైన’’ రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. రఫేల్‌ యుద్ధ విమానాల తయారీకి రిలయన్స్‌ కంపెనీని భాగస్వామిగా చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వమే సూచించిందంటూ ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన వెంటనే మాట మార్చారు. ఇందులో భారత ప్రభుత్వం ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రఫేల్‌‌ యుద్ధ విమానాల ఒప్పందంలో ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. యుద్ధ విమానాల తయారీలో ఎటువంటి నైపుణ్యం, అనుభవం లేని రిలయన్స్‌ కంపెనీని ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read