దేశం మొత్తం మీద రాజకీయ నేతల భాషలో మార్పు రావాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన డాక్టర్ రామినేని ఫౌండేషన్ 19వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా నేతలు మాట్లాడే భాష చూస్తున్నాం, వారి పదవికి, హుందాతనానికి ఇది తగునా, నేను ఏ ఒక్క వ్యక్తి గురించి మాట్లాడటం లేదు అంటూనే, పరోక్షంగా కెసిఆర్ గురించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఇట్టే అర్ధమైపోతుంది. మంచిమాట దానం లాంటిదని.. ప్రతిఫలంగా పుణ్యాన్ని ఇస్తుంది, చెడ్డ మాట అప్పు లాంటిది వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది అని, పిచ్చ వాగుడు వాగుతున్న రాజకీయ నాయకులకు వెంకయ్య చురకలు అంటించారు.

venkayya 08102018 2

కులమత ప్రాంతాల పేరుతో వివక్ష చూపించేవారు భారతీయులు కారు అని స్పష్టం చేసిన వెంకయ్య... ఇప్పటి నాయకుల విమర్శలు, ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సిద్ధాంతం తగ్గిపోయి రాద్ధాంతం పెరిగిపోయిందని తనదైన శైలిలో నేతలకు చురకలు అంటించారు. నాయకులు అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. నేతలు ప్రజాస్వామ్యస్పూర్తిని, విలువలను కాపాడాలని అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు కేవలం విధానాలకే పరిమితం కావాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య తిట్ల పురాణం హద్దుల దాటుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

venkayya 08102018 3

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రామినేని పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేశారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ 19వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ కార్యక్రమం నిర్వహించారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు రామినేని విశిష్ట పురస్కారాన్ని వెంకయ్యనాయుడు అందజేశారు. అదే విధంగా మహాసవస్రావధాని గరికపాటి నరసింహారావుకు, ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ కు, బాలసాహితీవేత్త చొక్కాపు వెంకటరమణకు విశేష పురస్కారాలను అందజేశారు. విశిష్ట పురస్కారం కింద రూ.2 లక్షలు, విశేష పురస్కారం కింద లక్ష రూపాయలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read