Sidebar

25
Sat, Jan

పవన్ కళ్యాణ్ సీక్రెట్ మీటింగ్ పెట్టి, డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ, మహా న్యూస్ లో ఉండగా, మూర్తి ఒక స్పెషల్ ప్రోగ్రాం వేసి, వీడియోలు చూపించిన సంగతి తెలిసిందే. అందులో, పవన్ ఆడిటర్ మాట్లాడుతూ, చెక్ ఇస్తున్నారా, కాష్ ఇస్తున్నారా ? మినిమం 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పిన వీడియో అందరూ చూసారు. అయితే, పవన్ నుంచి వచ్చిన ఒత్తిడితో, ఈ ప్రోగ్రాం మధ్యలోనే ఆపేశారు. పవన్ కళ్యాణ్, తన కులం వారితో, మాట్లాడిన మాటల వీడియో ప్లే చెయ్యలేదు. దీంతో మనస్తాపం చెందిన మూర్తి, మహా న్యూస్ కి రాజీనామా చేసి వెళ్ళిపోయారు.

murthy 23092018

ఈ తరుణంలో, పవన్ ఫాన్స్, ఆయన పై చేస్తున్న ఉన్మాదం తట్టుకోలేక, ఒక యుట్యూబ్ వీడియో విడుదల చేసారు. అందులో, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి చెప్పారు. కాపులతో మాత్రమే పవన్ కల్యాణ్ సమావేశమయ్యారని,అందులో పాల్గొన్న ఓ వ్యక్తి మాటలను కూడా వీడియోలో, ప్రజెంట్ చేశారు మూర్తి. అంతటితో ఆగిపోలేదు, తన దగ్గర జనసేనకు చెందిన నిఖార్సైన నిజాలు చాలా ఉన్నాయని, కానీ సందర్భంగా కాదని మాత్రమే బయటపెట్టడం లేదని తేల్చి చెప్పారు. తను బయపెట్టిన అంశంపైన కానీ, తన పై జనసేన కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలపైన కానీ చర్చకు తాను సిద్ధమని సవాల్ చేశారు. అవసరం అయితే పవన్ 99 ఛానెల్ కు వచ్చి, చర్చిస్తానని చెప్పారు.

murthy 23092018

అయితే, ఇప్పుడు మూర్తి, మరో కొత్త ఛానెల్ లో జాయిన్ అయ్యారు. టీవీ5 తెలుగు న్యూస్ ఛానల్ లో ఆయన తన కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో, మహా న్యూస్ లో చూపించిన పవన్ కళ్యాణ్ వీడియోలు, ఇప్పుడు ఇక్కడ చూపిస్తారు అనే చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫాన్స్, మూర్తి పై చూపించిన ఉన్మాదం అంతా ఇంతా కాదు. మూర్తి కమ్మ సామాజిక వర్గం అంటూ, తను ఆ కులం కాకపోయినా, అంటకట్టి, చంద్రబాబు డబ్బులు ఇచ్చి చేపించారు అంటూ హడావిడి చేసారు. కొంత మంది, మా పవన్ కి భయపడి, మూర్తి ఆపేసాడు, మా పవన్ గ్రేట్ అంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే ఇప్పుడు మూర్తి వీరందరికీ తగు రీతిలో సమాధానం చెప్తారు అనే చర్చ మొదలైంది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read