10 సంవత్సరాలు కాంగ్రెస్ అక్రమాలు చూసి, అప్పట్లో మోడీ ఇచ్చిన బిల్డ్ అప్ చూసి, ఈయనంటి నిజాయితీపరుడు ఈ ప్రపంచంలోనే లేడు అని నమ్మి, భారత దేశం మొత్తం, భారీ మెజారిటీతో మోడీని గెలిపించింది. కాని, 4.5 ఏళ్ళలో మోడీ చేతకాని పాలన చూసాం. చేతాకాని వాడు అనుకున్నాం కాని, అవినీతి పరుడు కాదులే అని అనుకున్న వాళ్ళు చాలా మంది. రాహుల్ గాంధీ రాఫెల్‌ కుంభకోణం గురించి చెప్పిన రోజు, ఎదో చెప్తున్నాడులే, రాహుల్ గాంధికి ఏమి తెలియదు అని చెప్పిన వారు చాలా మందే ఉన్నారు. కాని ఇప్పుడు అందరికీ మొబ్బులు తొలగిపోయాయి. మోడీ అవినీతిపరుడే కాదు, పెద్ద అబద్ధాల కోరు, మోసకారి అని వచ్చే వార్తలను చూస్తే అర్ధమవుతుంది. ఆంధ్రా ప్రజలను ఎలా నమ్మించి మోసం చేసారో, అలాగే ఈ దేశ ప్రజలను కూడా నమ్మించి మోసం చేసారు.

modi 22092018 2

తాజాగా ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు చెప్పిన మాటలతో, రాఫెల్‌ రహస్యం బట్టబయలైంది. యుద్ధ విమానాల డీల్‌లో మోదీ సర్కారు అడ్డంగా దొరికిపోయింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయెన్స్‌ డిఫెన్స్‌ సంస్థ ఎంపికలో తమ పాత్రేమీ లేదని, డసాల్ట్‌ కంపెనీయే ఆ సంస్థను ఎంచుకుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అబద్ధాలని తేలిపోయింది. అనుభవం లేని రిలయన్స్‌ డిఫెన్స్‌ను రాఫెల్‌ భాగస్వామిగా మోదీ ప్రభుత్వమే ఎంపిక చేసిందని, సర్వీస్‌ ప్రొవైడర్‌గా దానితోనే ఒప్పందం కుదుర్చుకోవాలని ఫ్రాన్స్‌కు తేల్చి చెప్పిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ సంచలన వాస్తవాన్ని బయటపెట్టారు.

modi 22092018 3

మరో అవకాశం లేక డసాల్ట్‌ ఏవియేషన్‌ రిలయన్స్‌ డిఫెన్స్‌తోనే ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చినట్లు ఆయన ఒక ఫ్రెంచ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్న హోలాండ్‌ స్వయంగా ఈ విషయం చెప్పడంతో బీజేపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. రాఫెల్‌ విమానాలకు సేవలు అందించే సామర్థ్యం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)కు లేదన్న మోదీ సర్కారు మాటలు వట్టి బూటకమేనని హాల్‌ మాజీ చీఫ్‌ సువర్ణరాజు వ్యాఖ్యానించిన మర్నాడే ఈ పరిణామం జరగడంతో బీజేపీ నెత్తిన మరో బాంబు పడినట్లయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read