మొన్న పాల వ్యాన్ కు హెరిటేజ్ స్టిక్కర్ అంటించి, ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ ఒక దొంగల ముఠా దొరికిన విషయం తెలిసిందే. అందరూ అనుకునట్టే, 2004 నుంచి ఎర్ర చందనం అక్రమంగా స్మగ్గ్లింగ్ చేస్తున్న ముఠానే దీని వెనకాలా ఉంది అని అప్పట్లో పోలీసులు తేల్చారు. పాల వ్యాన్ కు హెరిటేజ్ స్టికర్ వేసి అక్రమ రవాణా చేసిన కేసులో ఆరుగురు స్మగ్లర్లను చిత్తూరు రెడ్ శ్యాండిల్ ట్రాక్స్ ఫోర్స్ కార్యదళం అరెస్ట్ చేసింది. వారిచ్చిన సమాచారంతో, ప్రధాన నిందితుడు రాజాశేఖర్ అలియస్ చిన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను, జగన్ గారి రైట్ హ్యాండ్ అయిన ఎర్ర చందనం సుమ్గ్గ్లింగ్ డాన్ కొల్లంగంగి రెడ్డి ప్రధాన అనుచరుడు. ఈ కొల్లంగంగి రెడ్డి, చంద్రబాబు మీద అలిపిరి దాడి చేసిన వారిలో ఒకడు.

heritage 22092018 2

అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇలాంటి సంఘటనే జరిగింది. నిన్నటి వరకు పోలీస్‌, ప్రెస్‌, పాల వ్యాన్, ప్రజాప్రతినిధులు, తితిదే తదితర పేరిట స్టిక్కర్లున్న వాహనాల్లోనూ వచ్చిన ఎర్రదొంగలు, ఇప్పుడు ఏకంగా ఆర్మీ స్టిక్కర్‌ను వినియోగించడం కలకలం రేపింది. శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో వెలుగు చూసింది. ఆ మేరకు ఎర్రదుంగలు స్వాధీనం చేసుకోగా, స్మగ్లర్లు పరారయ్యారు. తిరుపతి అర్బన్‌ పరిధిలోని జీవకోన బీడీ కాలనీ వద్దకు శుక్రవారం వేకువ జామున 5 గంటల ప్రాంతంలో ఆర్మీ స్టిక్కరున్న వాహనం వచ్చింది. అదే సమయంలో అక్కడ కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ విజయనరసింహులు గుర్తించి, ఆర్మీ స్టిక్కర్‌ ఉండడంతో పట్టించుకోలేదు.

heritage 22092018 3

తర్వాత అనుమానంతో కొంతదూరం అనుసరించగా, వాహనంలోని వ్యక్తులు ఎర్రదుంగలను లోడ్‌ చేయడం గుర్తించారు. దీంతో సిబ్బందితో కలసి పట్టుకునే ప్రయత్నం చేయగా స్మగ్లర్లు పరారయ్యారు. అనంతరం వాహనాన్ని పరిశీలించగా, నాలుగు ఎర్రచందన దుంగలు దొరికాయి. విషపు రాతలు రాసే సాక్షి పత్రిక అప్పట్లో "ఎర్ర చందనం "హెరిటేజ్ దొంగలు" అనే కధనం ప్రచురించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు అదే విధంగా ఇండియన్ ఆర్మీని పెట్టి హెడ్డింగ్ ఇస్తారా ? అలా చేస్తే, ఇక్కడ కోర్ట్ లు, జడ్జిలు ఉండరు. ఆర్మీ వచ్చి, ఏమి చెయ్యాలో అది చేసి వెళ్తుంది. తొందరపడి, అలవాటులో పొరపాటుగా, రాయమాకయ్య జగన్..

Advertisements

Advertisements

Latest Articles

Most Read