అరేయ్ రోడ్డున పడేసారు రా, సహాయం చెయ్యండి రా అంటే, ఒకడికి మించిన, దగా ఇంకొకడు చేస్తాడు... కట్టు బట్టలతో రోడ్డున పడేసి, కనీసం రాజధాని కూడా లేకుండా, ఈ దేశం అత్యున్నత చట్ట సభలో, తలుపులు మూసి, లైవ్ ఆపేసి, ఒక రాష్ట్రాన్ని విడగోట్టాయి, ఈ దేశపు రాజకీయ పార్టీలు... తిరుపతి వెంకన్న సాక్షిగా, ప్రధాని అభ్యర్ధి హోదాలో, ఢిల్లీకి మించిన రాజధాని కట్టిస్తాం అన్నారు... ప్రపంచంలో అద్భుతమైన సిటీలు చూసి రండి, అలాంటి రాజాధాని కట్టుకుందాం అని చెప్పారు మోడీ... దగా పడ్డ ఆంధ్రుడు, మన దమ్ము ఏంటో ఈ దేశానికి చూపించటానికి, అమరావతి నిర్మాణం పూనుకున్నాం... 5 కోట్ల ఆంధ్రుల కోసం, 33 వేల ఎకరాలు త్యాగం చేసారు అమరావతి రైతులు...
మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమి చేసింది ? నిధులు ఇవ్వటం లేదు... అందుకే రాష్ట్రం పోరాడుతుంది... బీజేపీ ఎందుకు నిధులు ఇవ్వటం లేదో చెప్పాలి.. రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఎమన్నా ఉందేమో చెప్పాలి.. కాని, బీజేపీ మదం చూసారా... మొన్న, బీ జె పీ అధికార ప్రతినిధి జీ వీ ఎల్ నరసింహారావు అమరావతి లో మయసభ కడ్తున్నారా , 43 వేల కోట్లు రాజధాని కి అవసరమా అని అవహేళన గా మాట్లాడు.... ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, సెంటిమెంట్ కు డబ్బులు ఇస్తారా అని వ్యంగంగా మట్లాడి తెలుగువారిని అవమాన పరిచారు... డీ పీ ఆర్ లు పంపలేదు అని అబద్ధాలు ఆడారు... కాని, మన బీజేపీకి, మోడీ గారికి, ద్వారకా కన్వెన్షన్ సెంటర్ నిర్మించటానికి, ఇవేమీ అడ్డు కాదు...
5 కోట్ల, ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కి 15వందల కోట్లు విదిల్చి, ద్వారకా కన్వెన్షన్ సెంటర్ నిర్మించటానికి 26,700 కోట్లు ఖర్చు పెడుతుంది కేంద్రం. ఇందుకోసం ప్రధాని మోడీ నిన్న ఢిల్లీలోని ద్వారకాలో శంకుస్థాపన చేశారు. 221 ఎకరాల విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. 5 కోట్ల మంది రాజధాని, ఒక కన్వెన్షన్ సెంటర్ పాటి చెయ్యదా ? మేము కలలు రాజధాని కట్టుకుంటుంటే దీన్ని మయసభ అంటారా ? మీ ఢిల్లీ అహంకారం దిగే రోజు తొందరలోనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇలాగే విర్రవీగి పాతాళంలో ఉంది, ఇప్పుడు మీ వంతు... చివరగా, అమరావతి మయసభ కాదు, దగా పడ్డ ప్రతి తెలుగోడి ఆత్మగౌరపు ఇంద్రసభ..