ఏపీలో వైసీపీ-జనసేనతో కలిసి పనిచేస్తామని రాంమాధవ్ చెప్పకనే చెప్పారు. నిన్న కాకినాడలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాట్లాడుతూ, ఏపీలో వైసీపీ-జనసేనతో కలసి పనిచేస్తామని చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తప్ప ఎవరితో అయినా అధికారం పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నామని, అధికారంలో మేము కచ్చితంగా ఉంటామనియా న్నారు. అంటే వైసీపీని, జనసేనని బీజేపీ తన రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తున్నదని స్పష్టం చేశారు. 2019లో ఏపీలో టీడీపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో బీజేపీ పాలుపంచుకుంటుందని జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చెప్పడంలో అర్థమేమిటి?
అంటే జగన్, పవన్ తమ ఆధీనంలో ఉన్నట్లు స్పష్టం చేయడమే కదా. తెలుగుదేశం చాలాకాలం నుంచి మోడీ - జగన్- పవన్ లాలూచీ గురించి చెబుతున్న మాట నిన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్పష్టమైంది. 2019లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాదని మెజారిటీ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఏపీలోనూ వైకాపా ఇప్పుడున్న స్థానాలను కూడా నిలబెట్టుకోలేదని అనేక సర్వేలు చెబుతున్నవి. 2014లో జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పిన ఇండియా టుడే సర్వే తలకిందులైంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 2014లో ఆ మాత్రమైనా వైసీపీకి సీట్లు రావడానికి కారణం దళిత ఓట్లు, మైనారిటీ ఓట్లే.
ఇప్పుడు చంద్రబాబునాయుడు గారు చేస్తున్న మైనార్టీ సంక్షేమం, దళిత సంక్షేమం కారణంగానూ, జగన్ మోడీతో లాలూచీపడిన కారణంగానూ, 2019లో వైసీపీ ఇప్పుడున్న సీట్లు కూడా నిలుపుకోలేదని స్పష్టమవుతోంది. రాంమాధవ్ ఆటలు అరుణాచల్ ప్రదేశ్లో చెల్లవచ్చు కానీ, దక్షిణాదిలో చెల్లుబాటు కావు. కర్ణాటకలో అది రుజువైంది. అలాగే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లోనూ రుజువైంది. తమ పార్టీ నాయకులు ఎక్కడ జారిపోతారేమోననే భయంతో 2019లో జగన్-బీజేపీ- జనసేన కలిసి అధికారానికి వస్తారని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాయమాటలకు ఆంధ్రులు మోసపోరు. పైగా విభజన చట్టం హామీలు అమలుచేయనందుకు నిరసనగా 2019లో బీజేపీకి సున్నా సీట్లు రావడం ఖాయం.