నరేంద్ర మోదీ సర్కారు పాలనలో తమ బతుకు దుర్భరంగా మారిందని దేశంలోని నగర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, ఉపాధి కల్పన విషయాలు వారిని బాగా కలవరపెడుతున్నాయి. ధరల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మరింత పెరగకపోవచ్చనే ఆశ వారిలో తొంగిచూస్తోంది. రిజర్వుబ్యాంకు తాజాగా విడుదల చేసిన కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే ఫలితాలు... ఎన్నికల ముందు అధికార పక్షానికి ఆందోళన కలిగిస్తోంది. భారత ఆర్థిక పరిస్థితి అంచనాకు ఈ సూచీ అత్యంత కీలకం. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరు పట్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారన్నది వినియోగదారుల విశ్వాస సూచీ తెలియజేస్తుంది. జూన్‌- సెప్టెంబర్‌ మధ్య కాలంలో హైదరాబాద్‌ సహా 13 ప్రధాన ప్రధాన నగరాల్లో కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వేను ఆర్‌బీఐ నిర్వహించింది. 5364 మంది గృహస్థుల నుంచి సర్వేలో భాగంగా అభిప్రాయాలను సేకరించింది.

rbi 10102018 2

దీని వివరాలు రాజకీయంగా కీలకమైనవి. నిత్యావసరాల ధరవరలపై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నట్లు సర్వే చెబుతోంది. ఆర్థిక స్థితి ఈ జూన్‌ నెలలో 5.4 శాతం పతనాన్ని చూస్తే ఈ సారి ఏకంగా 10.6 శాతం అధోగతి ప్రయాణాన్ని వెల్లడిస్తోంది. ఇక నిరుద్యోగ విషయంలో యువతలో నిరాశా నిస్పృహలు పెల్లుబుకుతున్నట్లు 10.3 శాతం మేర పడిపోయిన గ్రాఫ్‌ వివరిస్తోంది. ధరవరల విషయంలో మూణ్ణెల్ల కిందటితో పోలిస్తే పతనం స్వల్పమే అయినా మరింత ఎక్కువ మంది ప్రజలు పెదవి విరుస్తున్నట్లు సర్వే బయటపెట్టింది. మొత్తం మీద వినియోగ దారుల విశ్వాసం ఏకంగా 4% పడిపోయింది. జూన్‌లో 98.3 పాయింట్లు కాగా ఇప్పుడు 94,8 పాయింట్లు. ముఖ్యంగా పెట్రోధరల పెరుగుదల, దాని పర్యవసానంగా నిత్యావసరాల పెరుగుదల ప్రజల్లో అసంతృప్తికి కారణమైనట్లు నిపుణుల విశ్లేషణ. అధికార పార్టీ వర్గాలు సర్వేలోని అభిప్రాయాలను తేలిగ్గా తీసుకున్నాయి.

rbi 10102018 3

కానీ ఈ సర్వే ఓటర్లలో ఎక్కువ శాతం ఉండే యువత అభిప్రాయాలకు అద్దం పడుతుందని నిపుణులు అంటున్నారు. 2013 డిసెంబరులో కూడా ఇలాంటి సర్వే చేశారు. 29.1 శాతం మంది మాత్రమే ఉద్యోగాల కల్పన ఏడాది క్రితం కంటే మెరుగుపడిందని అభిప్రాయపడ్డారు. 34.4 శాతం మంది గత ఏడాది కన్నా ఘోరంగా తయారైందని చెప్పారు. తుది ఫలితం -5.3 శాతంగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. 2018 సెప్టెంబరులో చేసిన తాజా సర్వేలో 35.2 శాతం మంది ఉద్యోగాల పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే మెరుగుపడిందన్నారు. 45.5 శాతం మంది గత ఏడాదితో పోలిస్తే దిగజారిందన్నారు. తుది ఫలితం -10.3 శాతం చూస్తే ఉద్యోగ కల్పన విషయంలో ప్రజల్లో ఏ మాత్రం భరోసా లేదని స్పష్టమవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read