వివాదాస్పదంగా మారిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, ఈ ఒప్పందం కుదుర్చుకోవడంపై నిర్ణయం తీసుకున్న ప్రక్రియ గురించి వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విమానాల ధర, సాంకేతిక అంశాలకు సంబంధించిన వివరాలు అవసరం లేదని కోర్టు వెల్లడించింది. అక్టోబరు 29లోగా ఆ వివరాలను వెల్లడించాలని చెప్పింది. రఫేల్‌ ఒప్పంద నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారో తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. దేశ రక్షణ అంశమైనందున వ్యయాల విషయాన్ని అడగబోమని కోర్టు స్పష్టం చేసింది.

rafel 10102018 2

భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రూ.59వేల కోట్లతో 36యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన డసో కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మ వాదించారు. ఈ కేసు జాతీయ భద్రతకు సంబంధించిందని, దీన్ని రాజకీయం చేస్తున్నారని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబరు 31న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.

rafel 10102018 3

మరోవైపు రాఫెల్‌కు సంబంధించిన అంశంపై ఎలాంటి అధికార నోటీసులు ఇవ్వడంలేదని స్పష్టం చేసింది న్యాయస్థానం. అంతేకాదు రాఫెల్ ఒప్పందంకు సంబంధించిన పిల్‌లో చేసిన ఆరోపణల ఆధారంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేదని... కేవలం సమాచారం తెలుసుకునేందుకు సీల్డ్ కవర్‌లో వివరాలను అడిగినట్లు ధర్మాసనం వెల్లడించింది. వాదనల సందర్భంగా కేంద్రం తరపున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్- ఇది కేవలం రాజకీయ లబ్ధికోసమే వేశారని ఇందులో దేశ భద్రతా అంశాలు మిళితమై ఉన్నందున బహిర్గతం చేయలేమన్నారు. వెంటనే పిటిషన్‌ను డిస్మిస్ చేయాల్సిందిగా కేకే వేణుగోపాల్ న్యాయస్థానాన్ని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read