ఐటీ సోదాల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఐటీ అధికారులను కలిసిన ఓటుకు నోటు కేసు నిందితుడు ఉదయ్‌సింహ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీంతో మరో ట్విస్ట్ బయటపడింది. నాగోల్‌లోని తమ బంధువు రణధీర్‌ ఇంట్లో నిన్న జరిగిన ఐటీ సోదాలు నకిలీవని ఉదయ్ సింహ చెబుతున్నారు. పోలీసులనే నకిలీ ఐటీ అధికారులుగా చేసి కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయించదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వ కక్షపూరితంగా వ్యవహరించడంలో భాగంగానే ఈ నకిలీ ఐటీ దాడులు జరిగినట్లు ఉదయ్‌సింహ ఆరోపిస్తున్నారు. దాదాపు 15 మంది నకిలీ ఐటీ అధికారులు రణధీర్ ఇంట్లో పలు డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లు, బంగారం నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

it 01102018

దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?.. లేక ఐటీ అధికారులు బాధ్యత వహిస్తారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయకార్ భవన్‌లో ఐటీ అధికారులను తాను అడిగినప్పుడు తమ బృందం ఆదివారం ఎక్కడా దాడులు చేయలేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. నకిలీ ఐటీ అధికారులు తమ బంధువుల ఇళ్లలో సోదాలు చేశారంటున్న ఉదయ్ సింహ దీనిపై చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కెసిఆర్ వర్కింగ్ స్టైల్ లో ఒక భాగమని, ఇలా ప్రతిపక్ష పార్టీల వారిని వేధింపులకు గురి చేస్తారని, రేవంత్ ఇంట్లో జరిగిన దాడులు కూడా అసలైనవో, నిజమైనవో తెలుసుకోవాలని రేవంత్ అభిమానులు అంటున్నారు.

it 01102018

మరో పక్క ఎలా ‌అయినా చంద్రబాబుని ఇరికించాలని, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను ఒక్కొక్కరిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం సెబాస్టియన్, కొండల్ రెడ్డి, ఉదయ్ సిన్హాల విచారణ లేదని చెబుతున్నా.. ఐటీ కార్యాలయానికి వారు హాజరయ్యారు. అసలు ఆయాకర్ భవన్‌లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతోందని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈనెల 3న రేవంత్ రెడ్డితోపాటు ఓటుకు నోటు కేసు నిందితులను కూడా ఐటీ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ కోర్టు ఓటుకు నోటు కేసును ఈ నెల 12కు వాయిదా వేసింది. మరో పక్క సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల ఇచ్చిన నోటీసులలో, ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే రూ. 10వేల ఫైన్‌తోపాటు ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read