మూడు రోజుల నుంచి తెగ ఊగిపోతున్న పవన్ కళ్యాణ్, నిన్న వీకెండ్ కావటంతో, వీకెండ్ ధమాకా చూపించారు. కాళ్ళు విరిచేస్తా, తాట తీస్తా, రాడ్లు పెట్టి కొడతా దగ్గర నుంచి, మీరు పిచ్చికుక్కలు అనే స్థాయికి దిగజారి పోయాడు పవన్... శనివారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘నేను సినిమా హీరోను కాను. ఉద్యమకారుడిని. పద్నాలుగేళ్ల వయసు నుంచే రాజకీయాలను అర్థం చేసుకుంటున్నా. మీవి విడిపోయిన రెండు వేళ్లు. మాది ఐదు వేళ్లూ బిగించిన పిడికిలి. మీ పద్ధతి మార్చుకోండి. బెదిరింపులు మానండి. లేదంటే దెబ్బకు దెబ్బ తీస్తాం పిచ్చి కుక్కల్లారా’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధికార పార్టీ పై విరుచుకుపడ్డారు.

pk 300092018 2

తనకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడంపై స్పందిస్తూ... ‘‘భయం ఉంటే రాజకీయాల్లోకే వచ్చేవాడిని కాను. సమస్యలపై పోరాడేందుకు ముందుకు వచ్చిన జనసేనానికి భయం ఎలా ఉంటుంది? 18 ఏళ్ల వయసులోనే సాయుధ పోరాటం చేయడానికి సిద్ధపడిన వాడిని’’ అని తెలిపారు. రక్షణ పేరిట తనపై నిఘా పెట్టారని... అందుకే పోలీసులను వెన క్కి పంపించేశానని తెలిపారు. ఏలూరు శివారులో బస చేసిన తమపై దాడికి పాల్పడిన 30 మందిని పట్టుకుని పోలీసులకు అప్పజెబితే ఏంచేశారని ప్రశ్నించారు. ‘‘మేం సుపరిపాలనను కోరాం. మీరు అరాచక పాలనను ప్రజలపై రుద్దారు. జాగ్రత్తగా వ్యవహరించండి. 2019 నుంచి రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి" అంటూ చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నాడు పవన్...

pk 300092018 3

చంద్రబాబు ఎప్పుడూ రెండు వేళ్లు చూపిస్తూ, విక్టరీ సింబల్ చూపిస్తారు. చంద్రబాబుని ఉద్దేశిస్తూ, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లడారు. చంద్రబాబు లాంటి నాయకుడిని, పవన్ లాంటి క్యారక్టర్ లేని వ్యక్తి, ఇలా పిచ్చికుక్కల్లారా, అంటుంటే,బ్యూటీ అఫ్ డెమోక్రసీ తప్ప ఏమి అనుకోవాలి ? జగన్ లాంటి వాడు కాల్చేస్తా అన్నా, పవన్ లాంటి వాడు ఇలా మాట్లాడినా, అంబటి, వాసిరెడ్డి పద్మ, రోజా లాంటి వారు జుబుక్సాకరంగా మాట్లాడినా, చివరకు తెలంగాణాలో ఉన్న బాల్కా సుమన్ అనే వాడు, ఇష్టం వచ్చినట్టు కూసినా, చంద్రబాబు ఇలాంటి వారిని అసలు పట్టించుకోరు కాబట్టి, వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎందుకంటే ఆయనకు ఉన్న లక్ష్యాలు వేరు. ఇలాంటి అల్ప జీవులతో, చిల్లర పంచాయితీ పెట్టుకోరు. నవ్యాంధ్ర నిర్మాణం, పోలవరం, అమరావతి ముందు, ఇలాంటి వారి మాటలు ఆయన పట్టించుకుంటారా ? అందుకే వీళ్ళు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. సరైన సమయంలో, ప్రజలే బుద్ధి చెప్తారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read