సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ సన్నద్ధమౌతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే వాట్సాప్‌ను ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకోవాల ని నిర్ణయించింది.పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్ని రాష్ట్రాల బీజేపీ నాయకత్వాలకు సందేశాలి చ్చారు. వాట్సాప్ ప్రచారానికి సెల్ ఫోన్ ప్రముఖ్ గా నామకరణంచేశారు. బూత్ స్థాయి కార్యకర్తలను కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకునే ఉద్దేశంతో బీజేపీ సెల్‌ఫోన్ ప్రముఖ్‌ను ప్రారంభించబోతోం ది. ప్రతీ బూత్ స్థాయిలో ముగ్గురికి వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేయిస్తారు.
ప్రతీ గ్రూప్‌లో 256 మంది సభ్యులను చేర్చడం క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను అధినాయ కత్వాన్ని తెలియజేయడం సెల్‌ఫోన్ ప్రముఖ్ ముఖ్య ఉద్దేశం. వీడియో, ఆడియో, టెక్స్ట్ ,గ్రాఫిక్,కార్టూన్స్ ద్వారా ఓటర్ల ను బీజేపీవైపు మళ్లించడమే వాట్సాప్ గ్రూప్‌ల ప్రధాన లక్ష్యం. వాట్సాప్ ప్రచారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు వారాల క్రితమే బీజేపీ సీనియర్లతో సమావేశమై.. డిజిటల్ కాంపెయిన్‌పై చర్చించారు. వాట్సాప్ ద్వారా ఎన్నికల ప్రచారం ఏ విధంగా సక్సెస్ చేయవచ్చో సీనియర్ అధికారులు మోడీకి వివరించినట్లు తెలుస్తోంది.
2019 లోక్‌సభ ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందునుంచే వాట్సాప్ వార్‌ను ప్రారంభించాలని బీజేపీ భావిస్తోంది. ఈలోపే రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలోని సెల్‌ఫోన్ ప్రముఖ్‌ను గుర్తించి దిశానిర్దేశం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. దేశంలో 100 కోట్ల 14 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్లు ఉండగా.. కనీసం 20 లక్షల మందికి వాట్సాప్‌లు ఉపయోగిస్తున్నట్లు అంచనా. అయితే సోషల్ మీడియాను వాడుకోకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం అంత సులువుకాదని పలువురు పార్టీ ఐటీ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో సోషల్ మీడియాను వాడుకుంటూనే వాట్సాప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ అధినాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.