ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్‌చంద్ర పునేఠా, ఆదివారం సచివాలయంలో దినేష్‌కుమార్ నుంచి బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1984వ ఐఏఎస్ అధికారిగా ఏపీకి వచ్చానని మొదటిసారిగా రాజంపేటలో సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టానన్నారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజలకు సేవలందించానని గత రెండేళ్లుగా సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ప్రధాన కార్యదర్శి అనే పదవి పెనుసవాళ్లతో కూడినదని, నూతన రాష్ట్రం అయినందున సహజంగా అనేక ఇబ్బందులుంటాయన్నారు. వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల జీవన విధానం మరింతగా మెరుగు పడే రీతిలో అన్ని కుటుంబాలు ఆనందంగా ఉండేందుకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు కేంద్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేరేలా పనిచేస్తానన్నారు. ఎప్పటికప్పుడు కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో సమన్వయ పరుచుకుంటూ ఒక బృందంగా ఏర్పడి మెరుగైన ఫలితాలు రాబడతామన్నారు. మొదటి నుంచి పేదలకు ఇళ్లు, ఇతర పథకాలను అందేలా శ్రద్ధ వహించామన్నారు.
పలువురి అభినందనలు..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనిల్‌చంద్రపునేఠను పలువురు అభినందించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్‌చంద్రపునేఠను పలువురు అభినందనలతో ముంచెత్తారు. శ్రీశైలం, తిరుపతి నుంచి వచ్చిన వేదపండితులు సీఎస్‌ను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, గుంటూరు,చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కోన శశిధర్, ప్రద్యుమ్న, ప్రణాళికాశాఖ కార్యదర్శి సంజ§్‌ుగుప్త, ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి, ఐఏఎస్ అధికారి విజయరామరావు తదితరులు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.అలాగే 19 ఉద్యోగ సంఘాల నాయకులు కేవీ కృష్ణయ్య, అజ§్‌ుబాబు, తిరుపతి ఎలైట్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ కె.బాలసుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు.