2019 ఎన్నికలే ధ్యేయంగా పెట్టుకొని అధికారం చేజిక్కించుకోవడానికి ప్రతిపక్షాలు,ప్రత్యేకించి కేంద్రం ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పెట్టడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.ఇందుకు నిదర్శనం ఆదివారం రాష్ట్ర బిజేపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విజయవాడలో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ మరో రెండు మూడు నెలల్లో సీఎం బాబు పదవి ఊడడం ఖాయమని ప్రకటించడంతో కేంద్రం బాబుపై చేస్తున్న కుట్రలు బలపడుతున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో బిజేపి ఎంపీ ఆపార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహరావు,ఎమ్మెల్సీ వీర్రాజు తదితరులు పటు సందర్భాల్లో బాబును జైల్‌కు పంపుతామని,సినిమా చూపిస్తామని ప్రకటించడం విధితమే. దీంతో రాష్ట్రంలో కలకలం రేకెత్తిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎ.రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటి, ఈడి దాడులు, ఫోరెన్సిక్ నిపుణులు స్టేట్‌మెంట్ రికార్డులు నమోదు పై కేంద్రం చేస్తున్న వ్యూహాం బాబుపై చర్యలకేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బాబు ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవడం,కేంద్రంపై జాతీయస్థాయిలో విపక్షాలను ఏకంచేసి కేంద్రంపై బాబు ఢీ అంటే ఢీ అనడం మిగిలిన విపక్షాలను కేంద్రంపై ఎదురించే విధంగా పావులు కదిపి సఫలీకృతులైయ్యారు.దీంతో కేంద్రం ఎనిమిది నెలలుగా గుర్రుమంటుంది.అయితే కేంద్రం వ్యవహరిస్తున్న విధానాలతో సీఎం బాబు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి తనను కేంద్రం ఏదో చేయబోతుందని,కుట్ర పన్నిందని పలు బహిరంగ సభల్లో ప్రకటించారు.అయినా బాబు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌లు కేంద్రం వ్యూహాలకు భయపడకుండా కేంద్రంపై మరింత దూకుడు పెంచారు.అంతేకాకుండా బాబు లోకేష్‌లు బిజేపి,వైసీపీ,జనసేన పార్టీనేతలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇస్తూ తారాస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇక ప్రత్యేకహోదా,విభజన చట్టం హామీల అమల్లో కేంద్రం విఫలమై,ఇచ్చిన హామీలను నిలుపుకోలేదని ధర్మపోరాటం పేరిట రాప్ట్రవ్యాప్తంగా టిడిపి చేపట్టిన దీక్షలు,సభలు,ఆందోళన కార్యక్రమాలతో ఏపి ప్రజలు కేంద్రంపై మండిపడుతున్నారు.రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ కంటే ప్రస్తుతం బిజేపిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.దీంతో ఎటు తిరిగి బాబుకు దూకుడు కళ్ళెం వేయని పక్షంతో రాష్ట్రంలో బిజేపి పరిస్థితి ఘోరంగా ఉంటుందని,దేశవ్యాప్తంగా విపక్షాలను ఐక్యం చేసిన బాబు వ్యూహాలను దెబ్బతీసే విధంగానే కేంద్రం వ్యూహాం సిద్ధం చేసిన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీ,జనసేనలు చేస్తున్న ఆరోపణలు తరహాలోనే బిజేపి నేతలు ఆరోపణలు చేయడం రేవంత్,బాబ్లీ సంఘటనలతో పాటు పలు నిరూపణకాని కేసులతో బాబును ఇరకాటంలో పెట్టి 2019ఎన్నికల్లో ప్రతిపక్షాలతోపాటు బిజేపి లబ్దిపొందే వ్యూహాంలో ఉన్నారని వినికిడి.బాబు కూడా వారి వ్యూహాలకు ప్రతివ్యూహాన్ని పన్ని అన్ని ఏర్పాట్లలో ఉంటూ,పార్టీ శ్రేణులను అన్నింటిని ఎదుర్కొవడానికి సర్వం సిద్ధం చేశారు.