రేవంత్ రెడ్డి... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. గత కొన్ని రోజులుగా తెలంగాణా రాష్ట్ర పాలకులకు కొరకారని కొయ్యగా తయారయ్యాడు. హేమాహీమీలు లాంటి మీడియా అధిపతులనే తన గ్రిప్ లో పెట్టుకున్న కెసిఆర్, రేవంత్ ని మాత్రం ఏమి చెయ్యలేకపోతున్నాడు. అందుకే అన్ని రకాలుగా దాడులు చేపిస్తున్నాడు. చుక్కలు చూపిస్తున్నాడు. కాని రేవంత్ మాత్రం, నిన్న వదలను కెసిఆర్ అంటూ వెంట పడుతున్నాడు. ఇది ఇలా ఉంచితే నిన్న రేవంత్, కెసిఆర్ కి ఒక ఛాలెంజ్ చేసారు. 15 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న రేవంత్, ఇలా ఛాలెంజ్ చేసాడు అంటే అది కెసిఆర్ కి పండగే. రేవంత్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ని కెసిఆర్ వదులుకున్నాడు అనే చెప్పాలి. రెండు రోజులపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
ఎంఎల్సీగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.నా సవాల్‌కు కేసీఆర్ 24 గంటల్లో స్పందించాలని, లేకపోతే అవినీతికి పాల్పడ్డది కేసీఆరే అని స్పష్టమవుతుందన్నారు. ఇదే సమయంలో 2001 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్కున్న ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఉద్యమ సమయంలో, 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దా నాలను నెరవేర్చకపోవడాన్నే నేను ప్రశ్నిస్తున్నా. దీన్ని జీర్ణించుకోలేకే అసెంబ్లి నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నారు అంటూ మండిపడ్డారు. ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు, నేను నా ఆస్థులు పై సిట్టింగ్ జడ్జితో విచారణకు రెడీ, నువ్వు రెడీనా అంటూ ఛాలెంజ్ చేసారు.
ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా, పవన్, జగన్, ప్రతి రోజు చంద్రబాబు పై వేసుకుపడుతూ, నువ్వు ఇన్ని తిన్నావ్, అన్ని తిన్నావ్ అంటూ విమర్శ చేస్తారు. చంద్రబాబు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించి, ప్రతి సంవత్సరం ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. మరి ప్రతిపక్షంలో ఉన్న పవన్, జగన్, ఇలాంటి ఛాలెంజ్ చెయ్యగలరా ? ఎలాగూ జగన్ కేసులు అన్నీ ఈ అక్రమ ఆస్థుల మీదే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ , నా అంత నీతిమంతుడు ఎక్కడా లేడు అని చెప్తూ ఉంటాడు. ఎక్కువ కాలం వద్దు , 2014 నుంచి ఇప్పటి వరకు పవన్ కు పెరిగిన ఆస్థుల పై విచారణకు ఛాలెంజ్ చేసి, అప్పుడు చంద్రబాబు పై కూడా ఒత్తిడి తెచ్చి, ఆయన ఆస్థుల పై కూడా ఛాలెంజ్ చేసే దమ్ము, పవన్, జగన్ కు ఉందా ? ఆప్పుడు ఎవడి బండారం ఏంటో తేలిపోతుంది కదా ? ప్రతిపక్షంలో ఉన్న పవన్, జగన్, రేవంత్ లాగా ఛాలెంజ్ చేసి నిజా నిజాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చెయ్యాలి.