పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన రెండో విడత ప్రజాపోరాట యాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ప్రారంబించిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా తెలుగుదేశం నాయకుల పై, చంద్రబాబు పై విరుచుకుపడుతూ, బీజేపీ, జగన్ జోలికి వెళ్ళకుండా యాత్ర కొనసాగుతుంది. అయితే ఈ రోజుతెల్లవారుజామున జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాధపురంలోని నరసింహస్వామి ఆలయంలో రహస్య పూజలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 4.30 వరకు గుడిలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారని అర్చకులు తెలిపారు.

pk 0110201 1

ఈ పూజలు జరుపుతున్నట్టు ముందుగా ఎవరికీ తెలియదు. ఎక్కడికి వెళ్ళినా హంగామా హంగామా చేసి, తన సొంత టీవీలో లైవ్ లు ఇచ్చే పవన్, ఈ పర్యటన మాత్రం అత్యంత గోప్యంగా ఉంచారు. అయితే గుడిలో పూజలు చేసిన అర్చకులు బయటకు చెప్పే వరకు ఎవరికీ తెలియదు. పవన్, అసలు రహస్య పూజలు ఎందుకు చేశారన్న విషయం ఏపీలో చర్చనీయాంశమైంది. ఇదే ఆలయంలోనే పవన్ కళ్యాణ్ తాంత్రిక పూజలు చేశారని, గతంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దాని పై అప్పట్లో తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఆ గుడి అంటే పవన్ కు చాలా ఇష్టమనే, అక్కడ తాంత్రిక పూజలు చేస్తారని, ఇది వరుకే కత్తి మహేష్ చేసిన గోల అందరికీ తెలిసిందే.

pk 0110201 1

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పూజలు ఎందుకు నిర్వహించారన్న విషయం తెలియరాలేదు. గత రెండు రోజుల నుంచి, నన్ను చంపటానికి ప్లాన్ చేసారు, నా ఇంటి పై డ్రోన్ లు తిప్పారు, అంటూ పవన్ చెప్పిన నేపధ్యంలో, తనకు ఎటువంటి ప్రాణ హాని జరగకుండా, ఈ పూజలు చేసారనే ప్రచారం జరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి సెక్యూరిటీ పమిస్తాం అంటే, నాకు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. పవన్‌ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ సోమవారం ఏపీలో కలిసిన విలీనమండలాల్లో పర్యటించనున్నారు. ముంపుకు గురౌతున్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని పోలవరం నిర్వాసితులతో పవన్ సమావేశంలో పాల్గొననున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read