అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఆదివారం లివిటిపుట్టులో కాల్చిచంపిన మావోయిస్టులు, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా ఇది ప్రతీకార చర్యనో, గిరిజన విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు చంపామనో వారు ప్రకటిస్తుంటారు. ఇప్పుడు హత్యలు జరిగి 5 రోజులవుతున్నా ఇంతవరకు అలాంటి ప్రకటన జారీచేయలేదు. ఇది వ్యూహాత్మక జాప్యమా, లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టులు ఎవరినైనా హతమారిస్తే.. అది తమ పనేనని సంఘటనా స్థలంలోనే లేఖ పెట్టి, నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోతారు.
కొన్ని సందర్భాల్లో మరుసటి రోజో, రెండు రోజులు ఆగాకో లేఖ పంపుతారు. ఇన్ఫార్మర్ల ద్వారా లేఖలు అందజేస్తారు. విలేకరులకు పోస్టులో పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ లివిటిపుట్టు ఘటనపై మావోయిస్టులు ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఇద్దరు గిరిజన నాయకుల్ని కాల్చి చంపడంపై ఎటువంటి వివరణ ఇవ్వాలనే దానిపై వారు తర్జనభర్జన పడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలోనూ వారు రాజకీయ నాయకుల్ని చంపారు. మణికుమారి గిరిజన సంక్షేమ మంత్రిగా ఉండగా ఆమె భర్త వెంకటరాజును హత్య చేశారు. హుకుంపేటలో సమిడ రవిశంకర్‌ను చంపారు. అయితే కిడారి, సోమలను హత్య చేయడంపై గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
అధికార దాహం కోసం ప్రతిపక్ష నేతలు మావోలతో చేతులు కలపటం చూసాం.. ఆనాడు చంద్రబాబు పై దాడి చేసింది కూడా అప్పటి రాజశేఖర్ రెడ్డి అనుచురుడు గంగి రెడ్డి. నాడు చత్తీస్‌ఘర్ లో కాంగ్రెస్ కు చెందిన విసి శుక్లా, పిసిసి ప్రేసిడెంట్ నడకుమార్ పాటిల్, సీఎం రేస్ లో ఉన్న మహేంద్ర ఖర్మతో పటు 27 మందిని ఒకే స్పాట్ లో మావో లు కాల్చి చంపడం లో దాగి ఉన్న రాజకీయా కోణం ఏంటి ? యావత్ దేశం లోని మావోలకు అడ్డాగా మారిన చత్తీస్‌ఘర్ లో బిజేపీ 3 సార్లు పవర్ లోకి రావడం, మావోలతో కొందరు నేతలు చేతులు కలిపి చేస్తున్న రాజకీయం, అరకు ఘటన ఫై మావో పార్టి ఏమి చెప్పనుఉంది ? చంపాల్సినంత తప్పులు వారు ఏమి చేశారంటూ గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టుల చర్యను ఎవరూ హర్షించడంలేదు.