నిన్న దెందులూరులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడుగా, అంత మంది యువత ఫాలో అయ్యే వ్యక్తి, ఎంత బాధ్యత లేకుండా మాట్లడాడో చూసాం. చింతమనేని ఆకు రౌడీ అని, తలకాయి నరకాలి అని, కొట్టాలని, ఇలా అనేకసార్లు అక్కడ ఉన్న యువతకు పిలుపిచ్చాడు. ఇది పక్కన పెడితే, 16 ఏళ్ళకే రౌడీలను కొట్టే వాడిని అని, చంద్రబాబుని జగన్ నుంచి కాపాడింది నేనే అని, ఎవర్తో ఎవరితోనో పడుకుంటే నేను సమాధనం చప్పాలా అంటూ, ఎంతో జుబుక్సాకరంగా, బాధ్యత లేని గాలి వ్యక్తిలాగా, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసాడు. అయితే, స్వతహాగా దూకుడు స్వభావం ఉన్న చింతమనేని, పవన్ పై విరుచుకుపడతారని, అక్కడే పవన్ కూడా ఉండటంతో, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందేమో అని అందరూ భావించారు.
అయితే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన చింతమనేని మాత్రం, చాలా బ్యాలన్సు చేసుకుని పవన్ పై విమర్శలు చేసారు. పవన్ కుల గొడవలు రేపటానికి వచ్చాడు అని తెలుసుకుని, ఎక్కడా బ్యాలన్సు తప్పలేదు. అదే సమయంలో పవన్ కి సరైన జవాబే చెప్పారు. తనపట్ల వచ్చిన ఆరోపణలపై మీకు ఇష్టమొచ్చిన కమిటీ వేసుకోండని ఆయన సవాల్ చేశారు. ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకోకుండా.. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులతో కలిసి పని చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పార్టీ నాయకుడి నుంచి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ స్థాయికి పడిపోయారన్నారు. ‘నువ్వు నాపై పోటీ చేయి. చావో రేవో దెందులూరులోనే తేల్చుకుందాం. నువ్వు గెలిస్తే.. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిపై పోటీ చేసి ఓడిపోయానని అనుకుంటా. నీ విజయోత్సవంలో పాల్గొంటా.. నేను గెలిస్తే షేక్ హ్యాండ్ ఇవ్వు చాలు అంతే..’ అంటూ పవన్ కల్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నిజంగా తాను చేసిన తప్పుల గురించి చెబితే సరిదిద్దుకుంటాననీ, సానుకూల విమర్శలు చేస్తే స్వాగతిస్తానని వెల్లడించారు. తొలుత దెందులూరు ప్రజలు, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు, చివరికి పార్టీ అధినేత చంద్రబాబు తనకు హైకమాండ్ అని చింతమనేని స్పష్టం చేశారు. పవన్ చేసిన అర్థం లేని విమర్శలతో తన జీవితంలో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తనపై 37 కేసులున్నాయని పవన్ తప్పుడు ఆరోపణలు చేశారని.. వాస్తవంగా తనపై ఉన్నవి 3కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పవన్‌కల్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడితే ఆయన మూడు రోజులు భోజనం చేయరని అన్నారు. ఓ పార్టీకి అధినేతగా ఉన్న పవన్ ఇష్టం వచ్చినట్లు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతారని చింతమనేని అన్నారు. తాను రాజ్యాంగశక్తినని పవన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. పవన్ తాను కొనుగోలు చేసిన ఛానల్ ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొత్తానికి, మనం ఒకడిని టార్గెట్ చేస్తున్నాం అంటే, ఆడిని పెద్దాడిని చెయ్యకూడదు, వీపీ గాడిని చెయ్యాలి.. ఇది నిన్న ఊగిపోయిన పవన్ కళ్యాణ్ కి, ఈ రోజు ఎక్కడా బాలన్స్ తప్పకుండా, దించేసిన చింతమనేనికి తేడా...