మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో అకాల వర్షాలు, పిడుగులు పడి సుమారు 34 మంది మరణించారు. పీఎంఓ దీనిపై ఒక ట్వీట్ చేస్తూ, గుజరాత్ మృతుల కుటుంబాలకు మాత్రమే ప్రధాని సంతాపం తెలపడంతో పాటు పీఎం సహాయనిధి నుండి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున సాయం ఆమోదించినట్టు పేర్కొంది. అయితే ఈ ట్వీట్ పై పెద్ద దుమారం రేగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా వర్షాలకు మనుషులు చనిపోతే, వారిని కనీసం తలవకుండా, కేవలం గుజరాత్ లో చనిపోయిన వారిని మాత్రమే, ప్రధాని ట్విట్టర్ లో సంతాపం తెలిపి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే, ఈ విషయం పై అందరూ తీవ్రంగా స్పందించారు.
గుజరాత్ కు మాత్రమే, మోడీ ప్రధాని అని మరో సారి రుజువైందని కామెంట్ లు పెట్టారు. ఉత్తర భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో 34 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ గుజరాత్ మృతుల పట్ల మాత్రమే ప్రధాని ఆవేదన వ్యక్తం చేయడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మీరు దేశానికి ప్రధానా? గుజరాత్‌కు మాత్రమే ప్రధానా?' అంటూ ఓ ట్వీట్‌లో నిలదీశారు. మధ్యప్రదేశ్‌లో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారని, మరి గుజరాత్ ప్రజలపైనే మోదీకి ఎందుకు సానుభూతని నిలదీశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా ప్రజలు మాత్రం ఉన్నారని గుర్తుచేశారు. వారిపై కూడా పీఎం సానుభూతి చూపించి ఉండొచ్చన్నారు.
గంటలోనే స్పందన... కమల్‌నాథ్ ట్వీట్ చెయ్యటం, పెద్ద ఎత్తున నెటిజెన్ లు మండి పడటంతో, ప్రధాని మోడీ దిగిరాక తప్పలేదు. గంటలోనే ప్రధాని కార్యాలయం తిరిగి ట్వీట్ చేస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలకు మృతి చెందిన వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50,000 సాయం ప్రధాని ప్రకటించారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొంది. అయితే ప్రధాని గుజరాత్ పై చూపిస్తున్న ప్రేమ, మాత్రం మరోసారి బయట పడింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలను, మోడీ ఎలా చూస్తున్నారో చెప్పటానికి ఇదే తాజా ఉదాహరణ.