ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈవీఎంలు, వీవీ ప్యాట్లలో పోలైన ఓట్లలో తేడాలు వస్తున్నాయని న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. అయితే ఈవీఎంలు, వీవీప్యాట్ మెషీన్లలో ఓట్ల మధ్య వ్యత్యాసాలపై దాఖలైన ఫిర్యాదులు తప్పని రుజువైతే దాన్ని నేరంగా పరిగణించి ఆరు నెలల శిక్ష విధిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)ల పనితీరును ప్రశ్నించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్న నిబంధనపై దాఖలైన పిటిషన్‌కు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల మధ్య వ్యత్యాసాలపై వచ్చిన ఫిర్యాదులు నిజం కాదని రుజువైతే దాన్ని నేరంగా పరిగణించరాదంటూ పిటిషనర్ కోరారు.

evm 29042019

ఎన్నికల కోడ్‌లోని నిబంధనల్లో సెక్షన్ 49 ఎంఏ ప్రకారం.. ఈవీఎం లోపాలున్నాయంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి, సదరు ఆరోపణలు తప్పని రుజవైతే ఐపీసీ సెక్షణ్ 177 కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ‘‘తప్పుడు సమాచారం ఇచ్చినందుకు’’ ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఈవీఎంలో ఓటు వేసినప్పుడు ఏదైనా తేడా జరిగినా ఫిర్యాదు చేసేందుకు ఓటరు వెనక్కి తగ్గాల్సి వస్తోందని పిటిషనర్ సునీల్ అహ్యా ధర్మాసననానికి విన్నవించారు. ఎన్నికల కోడ్‌ నిబంధనల్లోని సెక్షన్ 49ఎంఏ ప్రకారం ఈవీఎంలలో లోపాలున్నాయంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి దాన్ని నిరూపించాల్సి ఉంటుంది.

evm 29042019

ఒకవేళ ఆ వ్యక్తి చేసిన ఆరోపణలు తప్పని రుజువైతే ఐపీసీ సెక్షన్ 177 ప్రచారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ఈ నేపథ్యంలో సునీల్ అహ్యా ఈ నిబంధనను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈసీ నిబంధన కారణంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతాయని పిటీషనర్ అభిప్రాయపడ్డరు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లలో తేడా జరిగినా ఓటర్లు ఫిర్యాదు చేసేందుకు ముందుకురారన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ నిబంధన ప్రతిబంధకంగా మారుతుందని అందుకే తొలగించాలని ధర్మాసనాన్ని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read