ఈస్టర్ పర్వదినమైన ఆదివారం ఉదయం శ్రీలంక రాజధాని కొలంబోను వరుస బాంబు పేలుళ్లు కుదిపేశాయి. మూడు చర్చిలు, రెండు హోటళ్లు లక్ష్యంగా జరిగిన బాంబు పేలుళ్లలో 20 మంది మృతి చెందారు. 160 మంది వరకూ గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆస్తినష్టం కూడా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోయ చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలు చేస్తున్న భక్తులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు హోటల్ షాంగ్రి లా, సిన్నమాన్ గ్రాండ్ హోటల్స్‌లోనూ పేలుళ్ల చోటుచేసుకున్నాయి. ఈస్టర్ సండే ప్రార్థనలు జరుగుతుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్టు పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు.

easter 21042019 1

పోలీసు అధికారుల వివరాల ప్రకారం కొలంబోలోని కొచ్చికోడ్‌ ప్రాంతంలో ప్రముఖ సెయింట్‌ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలోనూ పేలుళ్లు సంభవించాయి. అలాగే శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆయా చర్చిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన చోట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 160 మంది గాయపడగా దాదాపు 20 వరకు మృతి చెందినట్లు సమాచారం. ఈస్టర్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

easter 21042019 1

శ్రీలంకలోని బాంబు పేలుళ్ల ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. ఈ ఘటనపై శ్రీలంకలోని భారత హైకమిషనర్‌తో మాట్లాడామని చెప్పారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. మరోవైపు శ్రీలంకలోని భారత రాయభార కార్యాలయం భారత పౌరుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది. సమాచారం కోసం +94 777903082, +94112422788, +94 112422789, +94 777902082, +94772234176 నంబర్లను సంప్రదించాలని కోరింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read