ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం, ప్రతి ఒక్కరు అసహ్యించుకునేలా, ద్వేషించుకునేలా చేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుకు ఘోర పరాభవం ఎదురైంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుంగా.. ఆయనపై కాన్పూర్‌కు చెందిన డాక్టర్ శక్తి భార్గవ్ చెప్పు విసిరారు. అయితే జీవీఎల్‌కు అది దూరంగా పడింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలుకాలేదు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పార్టీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని.. పోలీసులకు అప్పగించారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే బీజేపీ ఆఫీసులోకి భార్గవ ఎలా ప్రవేశించాడనే విషయంపై ఆరాతీస్తున్నారు.
పార్టీ కార్యకర్త అయ్యి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. భార్గవను అద్వానీకి వీరాభిమానిగా చెబుతున్నారు. ఆయన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇదే తెలుస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భార్గవ.. మోదీ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ముందున్నాడు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ లాంటి సీనియర్ నేతలకు పార్టీలో వరుసగా ఎదురవుతున్న అవమానాలతోనే ఇలా దాడి చేసి ఉంటాడని చెబుతున్నారు. భోపాల్ అభ్యర్థిగా భాజపా తరఫున ప్రజ్ఞాసింగ్‌ను ప్రకటించిన అనంతరం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు జీవీఎల్ గురువారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కాన్పూర్‌కు చెందిన వైద్యుడు శక్తి భార్గవ్ జీవీఎల్‌పైకి చెప్పు విసిరాడు. వెంటనే అక్కడే ఉన్న పార్టీ కార్యాలయ సిబ్బంది అతడిని పట్టుకుని బయటకు తరలించారు. ఇలాంటి దాడులకు తాను భయపడబోనని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లే ఇలాంటి దాడులు చేస్తారని ఆరోపించారు. చెప్పువేసిన వ్యక్తిపై తీవ్ర స్థాయిలో కార్యాలయ సిబ్బంది దాడిచేశారు. చెప్పు విసరడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో జీవీఎల్ గురించి తెలిసిన వాళ్ళు అందరూ, దాడిని ఖండిస్తున్నా , జీవీఎల్ లాంటి ఇరిటేటింగ్ స్పీచ్ లు ఇచ్చే వారికి, ఇలా జరగటం ఆశ్చర్యం లేదు అంటున్నారు. చంద్రబాబు మంచి వాడు కాబట్టి, ఇక్కడ ఇలాంటి దాడులు జరగలేదని, లేదంటే జీవీఎల్ మాట్లాడే తలా తోక లేని వాదనలకి, ఇలాంటివి రోజుకు ఒకటి ఇక్కడ జరిగేవని గుర్తు చేస్తున్నారు.