ఎన్నికల ముందు వరకూ వైసీపీ, జనసేన పార్టీల ఐటీ సెంటర్లలో ఉద్యోగుల హడావుడి మాములుగా లేదు. ఎన్నికలు ఇలా ముగిశాయో..లేదో.. ఆయా పార్టీల ఐటీ సెంటర్లు మూగబోయాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి. ఖర్చుకు భయపడి చాలా పార్టీలు సిబ్బందికి ఉద్వాసన పలుకుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సోషల్‌ మీడియా ప్రచారం, అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణ కోసం పలు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఐటీ సెంటర్లను అట్టహాసంగా ప్రారంభించాయి. స్థాయి, పనితనం ఆధారంగా సిబ్బందికి భారీగా వేతనాలు ఇచ్చాయి. అయితే, ఎన్నికలు ముగియడంతో ఐటీ సెంటర్లలోని సిబ్బందికి అన్ని పార్టీలు ఉద్వాసన పలుకుతున్నాయి. సగానికి సగం మందిని విధుల నుంచి తొలగించేస్తున్నాయి. దీంతో అర్ధంతరంగా పని కోల్పోయిన వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

janasena 18042019

జనసేన పార్టీ ఐటీ సెంటర్‌ కోసం రాయదుర్గంలోని ఖాజాగూడ సమీపంలో మూడంతుస్థుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దాదాపు 500పైచిలుకు మందిని నియమించుకున్నారు. దీన్ని పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించగా.. పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలు ముగిసి వారం కూడా గడవకముందే ఐటీ సెంటర్‌లోని మెజార్టీ సిబ్బందికి ఉద్వాసన పలికారు. దాదాపు 350 మందిని విధుల్లోంచి తొలగించారు. మూడంతస్థుల భవనంలో ఒక అంతస్థు మాత్రమే ఉంచుకుని మిగతా రెండింటిని జనసేన ఖాళీ చేయడంతో టు-లెట్‌ బోర్డు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో 100-150 మంది ఉద్యోగులతోనే ఐటీ సెంటర్‌ నిర్వహించాలని భావిస్తున్నామని, మళ్లీ ఎన్నికల వరకూ ఈ సెంటర్‌తో అంతగా పని ఉండబోదని జనసేన నేత ఒకరు తెలిపారు.

janasena 18042019

ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఐటీ సెంటర్‌లో అధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌ సమీపంలో ఉన్న ఐటీ సెంటర్‌ ద్వారా పార్టీ ప్రచారం కోసం పలు యూట్యూబ్‌ చానళ్లు సైతం నిర్వహించారు. సెంటర్‌కు సంబంధించిన పనులను వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్‌మీడియా ఖాతాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించారు. ఇందుకోసంటెలీకాలర్లు, కంటెంట్‌ రైటర్లు, ఫొటోషాప్‌ డిజైనర్లను అధిక సంఖ్యలో నియమించుకున్నారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ టెలీకాలర్లకు లక్ష్యాలు విధించారు. పార్టీ వార్తలను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన వాళ్లకు... ఎన్నికలు ముగియడంతోనే చేదు వార్త అందింది. ఇక, విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెప్పేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read