ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు, కేంద్ర ఎన్నికల సంఘం మెతక వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్ ఫైర్ అయ్యారు. పోలింగ్ కు ముందు ఐటీ దాడులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా ప్రస్తత ఎన్నికల సంఘం పని తీరు ఉందని విమర్శించారు. ఈ మేరకు ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరాకు ఫోన్ చేసి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు. 1990 డిసెంబరు 12న 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శేషన్ 1996 డిసెంబరు 11వ తేదీ వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆయన హయాంలోనే ఎన్నికల సంఘానికి ఉన్న విశేష అధికారాలను ఎగ్జిక్యూట్ చేసి చూపిన అ అధికారిగా శేషన్‌కు పేరుంది. శేషన్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులు అయ్యే వరకు ఎన్నికల సంఘం అధికారాలేమిటన్నది ప్రజలకు, అధికారులకు కూడా తెలియదనే చెప్పాలి. ఆయన హయాంలో ఎన్నికల కమిషన్ అంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. అటువంటి శేషన్ ప్రస్తుత ఎన్నికల సంఘం పనితీరును తప్పుపట్టారు. (Source: AndhraPrabha https://bit.ly/2Zn0l3C)

seshan 19042019 1

ఈవీఎంల పనితీరుపై ఎన్నో సందేహాలున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో పోలింగ్‌ నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని.. అనేక చోట్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఓటు వేయడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా దేశాల్లో ఈవీఎంల స్థానంలో పేపర్‌ బ్యాలెట్‌ పోలింగ్‌నే నిర్వహిస్తున్నారని.. భారత్‌లోనూ పేపర్‌ బ్యాలెట్‌ పోలింగ్‌నే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాలని కోరుతున్నట్టు తెలిపారు చంద్రబాబు. రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్‌లు కొన్నారు.. అంత ఖర్చు పెట్టి కేవలం ఒక్క వీవీప్యాట్‌లో స్లిప్పులు మాత్రమే లెక్కించడం ఏంటీ? అని ప్రశ్నించారు చంద్రబాబు.

seshan 19042019 1


ఈవీఎంల పనితీరుపై చాలా సందేహాలున్నాయన్న ఆయన.. వీవీపాట్ లో గుర్తు 7 సెకండ్లు పాటు ఓటరుకు కనపడాల్సి ఉండగా, కేవలం మూడు సెకండ్లు మాత్రమే కనిపిస్తుందని.. సమయం ఎందుకు తగ్గింది అని అడిగితే ఈసీ దగ్గర సమాధానం లేదని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం తీరు సంతృప్తికరంగా లేదన్న చంద్రబాబు.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఆలోచిస్తున్నామని.. 50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని వెల్లడించారు. 50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించటానికి, ఈసీకి ఉన్న ఇబ్బందులు ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read