తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నాను. కేసీఆర్ వైఖరిపై తమకు ఉండే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే విషయంలో ఇప్పుడేమీ చెప్పలేమని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఫలితాల అనంతరం తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామని సురవరం చెప్పారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిచ్చే అంశంపై ఢిల్లీలో మంగళవారం ఎన్టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సురవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

cpi 07052019

కేసీఆర్, పినరయి విజయన్ భేటీని కేవలం సీఎంల సమావేశంగానే చూస్తామని చెప్పారు. విజయన్ సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు మాత్రమేనని.. ఆయన స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ స్థాయి నాయకత్వం ఉందని చెప్పారు. ‘కేసీఆర్‌పై మా అనుమానాలు మాకున్నాయి. కేసీఆర్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటారు. అవసరాన్ని బట్టి తృతీయ కూటమికి కూడా కేసీఆర్ మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ మెజార్టీ రానప్పుడు.. మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంది’ అని సురవరం చెప్పారు.

cpi 07052019

దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీజేపీపై తీవ్రమైన అసంతృప్తి ఉందని సురవరం తెలిపారు. ఈ అసంతృప్తిని పోగు చేయడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ విఫలమైందన్నారు. ‘కాంగ్రెస్ పెద్ద పార్టీ. కానీ, రాజకీయ చొరవ లేదు. సెక్యులర్ శక్తులను ఏకం చేయడంలో విఫలమైంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాదు. హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని భావిస్తున్నాం’ అని సురవరం అన్నారు. ఇప్పటికీ కెసిఆర్ పై మాకు చాలా అనుమానాలున్నాయన్నారు. కేరళ సీఎం విజయన్ పొలిట్ బ్యూరో సభ్యుడైనా ఆయన స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు ఉండవన్నారు. కెసిఆర్ అవసరాన్ని భట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకుంటారని, రేపు అవసరాన్ని భట్టి కెసిఆర్ తృతీయ కూటమికి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read