మోడీ, అమిత్ షా ప్లాన్ ప్రకారం, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ మూడు నెలల క్రిందట హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భగంగా, చంద్రబాబు దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసే కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్లాన్ వేసారు. దీని కోసం కేసీఆర్ రంగంలోకి దిగి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ ను కలిసి హడావిడ్ చేసారు. వాళ్ళని చంద్రబాబు వైపు వెళ్ళకుండా ప్లాన్ వేసారు. అయతే కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఎన్నికలకు ముందే ప్రజాకూటమిగా ఏర్పడాలనే నిర్ణయానికి 21 పార్టీలు వచ్చాయి, ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఇప్పుడు 23న ఫలితాలు వస్తున్న తరుణంలో, మళ్ళీ కేసీఆర్ ను ఆక్టివేట్ చేసారు మోడీ, షా. విపక్షాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేసారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ టాస్క్ పూర్తి చెయ్యటానికి స్పీడ్ పెంచిన కేసీఆర్ రాష్ట్రాల బాట పట్టారు. సోమవారం నాడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయిన కూటమిపై నిశితంగా చర్చించారు. అయితే ఈనెల 13న కాంగ్రెస్‌తో కలసి పని చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కావాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు స్టాలిన్‌కు ఫోన్ భేటీ గురించి కేసీఆర్ ఇప్పటికే మాట్లాడారు. అయితే కేసీఆర్‌తో స్టాలిన్ సమావేశం జరగకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండటంతో కేసీఆర్, స్టాలిన్ భేటీపై అనుమానమేనని తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ వేస్తున్న కుప్పిగంతులు చూస్తున్న స్టాలిన్, ఈ తరుణంలో కేసీఆర్ తో భేటీకి విముఖత చూపించారు.
ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్‌తో సోమవారం జరిగిన భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించామని అంతే తప్ప ప్రధాని అభ్యర్థిపై చర్చ జరగలేదలేదని కేరళ సీఎం పినరయి విజయన్ మీడియాకు వివరించారు. కేసీఆర్‌తో చాలా ప్రాముఖ్యతగల సమావేశం జరిగిందన్నారు. కాగా.. కేరళ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం ఆయన విజయన్ అధికార నివాసానికి వెళ్లి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. ఇప్పుడు తమిళనాడు వెళ్దాం అనుకుంటే, అక్కడ స్టాలిన్ షాక్ ఇచ్చారు.