రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి రహస్య మంతనాలు నిర్వహించా రు. వీరిద్దరే దాదాపు గంటసేపు శనివారం సమావేశం అ య్యారు. దీంతో మిథున్‌రెడ్డి సీఈవోతో ఏం చర్చించారు? ఎవరిపైనైనా ఫిర్యాదు చేశారా? అనే విషయాలేవీ బయటకు తెలియలేదు. వైసీపీకి చెందిన మరో నేత తలసిల రఘురామ్‌తో కలిసి సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి మిథున్‌రెడ్డి వచ్చారు. రఘురామ్ బయటే ఉండిపోగా.. మిథున్‌రెడ్డి ఒక్కరే సీఈవో గదిలోకి వెళ్లి.. గంట తర్వాత వచ్చారు. మీడియాకు ఏమి చెప్పకుండానే కారెక్కి వెళ్లిపోయారు.
ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచీ వైసీపీతోపాటు వివిధ పార్టీల నాయకులు సీఈవోను కలిశారు. ఎందుకు కలుస్తున్నదీ మీడియాకు వెల్లడించారు. ఫిర్యాదు లు, వినతిపత్రాలు ద్వివేదికి అందజేస్తూ వాటి తాలూకా ఫొ టోలు, వీడియోలను మీడియాకు విడుదల చేసేవారు. సీఈ వో ఆఫీసు నుంచి బయటకొచ్చిన తర్వాత ఎందుకు కలిసిందీ? ఏమని ఫిర్యాదు చేసిందీ అక్కడున్న విలేకరులకు చెప్పేవారు. వీటన్నింటికీ భిన్నంగా మిథున్‌రెడ్డి, సీఈవోల భే టీ సాగింది. ఓట్ల లెక్కింపునకు ఇంకా 20రోజులకు పైగా సమయం ఉంది. ఇలాంటి తరుణంలో మిథున్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో ఏకాంత చర్చల మర్మం ఏమిటో అంతుచిక్కని ప్రశ్నగా మారింది.